IPL 2023 Final: Ambati Rayudu Announced His Retirement From The IPL After CSK Vs GT Final - Sakshi
Sakshi News home page

Ambati Rayudu: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు

Published Sun, May 28 2023 6:36 PM

Ambati Rayudu announces IPL retirement - Sakshi

టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నైసూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐపీఎల్‌-2023 ఫైనల్‌ అనంతరం ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ నుంచి తప్పుకోనున్నట్లు రాయుడు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా ఆదివారం రాయుడు వెల్లడించాడు. కాగా అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం జరగనున్న తుదిపోరులో చెన్నైసూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్న సంగతి తెలిసిందే.

ఇక 2010లో ముంబై ఇండియన్స్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రాయుడు.. ఇప్పటివరకు 202 మ్యాచ్‌లు ఆడాడు. 2010 నుంచి  2017 సీజన్ వరకు ముంబైఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2018 సీజన్‌లో చెన్నైసూపర్‌కింగ్స్‌ జట్టులోకి రాయుడు చేరాడు. 2013, 2015,2017 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టులో రాయుడు భాగంగా ఉన్నాడు. 

"ముంబై, సీఎస్‌కే వంటి రెండు అద్భుతమైన జట్లకు ప్రాతినిద్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది. 204 మ్యాచ్‌లు, 14 సీజన్‌లు, 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు నా కెరీర్‌లో ఉన్నాయి. ఈ రోజు ఆరో టైటిల్‌ సాధిస్తాని ఆశిస్తున్నాను. ఈ ఫైనల్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను.

నా ఈ అద్భుతప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికి  ధన్యవాదాలు. మళ్లీ యూ టర్న్‌ తీసుకోను" అంటూ ట్విటర్‌లో రాయుడు పేర్కొన్నాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 202 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 4329 పరుగులు సాధించాడు. అతడి కెరీర్‌లో ఒక సెంచరీ ఉంది.
చదవండి: IPL 2023 Final: అప్పుడు అంచనాలే లేవు.. కానీ ఇప్పుడు! అచ్చం ధోనిలాగే..

Advertisement

తప్పక చదవండి

Advertisement