భారత్, ఇంగ్లండ్‌ టెస్టుకు ఏర్పాట్లు పూర్తి..

21 Jan, 2024 04:05 IST|Sakshi

హైదరాబాద్‌లో ఈనెల 25 నుంచి జరగనున్న భారత్, ఇంగ్లండ్‌ తొలి టెస్టుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు తెలిపారు. ఇప్పటికే 26 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ఆయన తెలిపారు. మొత్తం 25 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఆయన వివరించారు. భారత జట్టు శనివారమే నగరానికి చేరుకోగా, ఇంగ్లండ్‌ నేడు అడుగు పెడుతుంది.
 

>
మరిన్ని వార్తలు