కోహ్లి క్లాస్‌.. సూర్య మాస్‌.. హాంగ్‌కాంగ్‌ను చిత్తు చేసిన భారత్‌ | Sakshi
Sakshi News home page

Asia Cup 2022 IND VS HK: కోహ్లి క్లాస్‌.. సూర్య మాస్‌.. హాంగ్‌కాంగ్‌ను చిత్తు చేసిన భారత్‌

Published Wed, Aug 31 2022 10:58 PM

Asia Cup 2022 IND VS HK: Team India Beat Hong Kong By 40 Runs - Sakshi

ఆసియా కప్‌ 2022లో భాగంగా బుధవారం హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. కోహ్లి క్లాస్‌ ఇన్నింగ్స్ (44 బంతుల్లో 59 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు)‌, సూర్యకుమార్‌ మాస్‌ ఇన్నింగ్స్‌తో (26 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో టీమిండియా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా గ్రూప్‌-ఏలో సూపర్‌ 4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో హాంగ్‌కాంగ్‌ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి హాంగ్‌కాంగ్‌ను కట్టడి చేశారు. భువనేశ్వర్‌, అర్షదీప్‌, జడేజా, ఆవేశ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. హాంగ్‌కాంగ్‌ ఇన్నింగ్స్‌లో బాబర్‌ హయత్‌ (41) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్‌) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ పారేసుకున్నాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (39 బంతుల్లో 36; 2 సిక్సర్లు) నెమ్మదిగా ఆడి విసుగు తెప్పించాడు. హాంగ్‌కాంగ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ యాసిమ్‌ ముర్తజా (0/27), ఆయుష్‌ శుక్లా (1/29), మహ్మద్‌ గజన్ఫార్‌ (1/19) కాస్త పర్వాలేదనిపించారు. 
చదవండి: రోహిత్‌ వరల్డ్‌ రికార్డును సమం చేసిన కోహ్లి
 

Advertisement
Advertisement