వికాస్‌ ‘కంచు’ పట్టు 

11 Apr, 2023 12:19 IST|Sakshi

అస్తానా (కజకిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ రెండో రోజు పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో భారత్‌కు ఒక కాంస్య పతకం లభించింది. 72 కేజీల విభాగంలో వికాస్‌ కాంస్య పతక బౌట్‌లో 8–0తో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో జెయిన్‌ తాన్‌ (చైనా)పై గెలుపొందాడు.

భారత్‌కే చెందిన సుమిత్‌ (60 కేజీలు), రోహిత్‌ దహియా (82 కేజీలు), నరీందర్‌ చీమా (97 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్‌లలో పోటీపడ్డారు. కానీ ఈ ముగ్గురికీ నిరాశే ఎదురైంది. కాంస్య పతక బౌట్‌లలో సుమిత్‌ 6–14తో మైతా కవానా (జపాన్‌) చేతిలో... రోహిత్‌ 1–5తో అలీరెజా (ఇరాన్‌) చేతిలో... నరీందర్‌ 1–4తో ఒల్జాస్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓటమి పాలయ్యారు. 

మరిన్ని వార్తలు