Ind vs Aus: Australia Probable Playing 11s for the 4th test - Sakshi
Sakshi News home page

IND vs AUS: భారత్‌తో నాలుగో టెస్టు.. స్టీవ్‌ స్మిత్‌ కీలక నిర్ణయం! స్టార్‌ ఆటగాడికి నో ఛాన్స్‌

Published Wed, Mar 8 2023 3:18 PM

Australia Probable Playing 11s for the 4th test of BGT - Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. ఆసీస్‌ మాత్రం మూడో టెస్టు ఫలితాన్ని రిపీట్‌ చేసి సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాను 9 వికెట్ల తేడాతో ఆసీస్‌ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్‌ స్మిత్‌ వ్యూహాల ముందు రోహిత్‌ సేన తేలిపోయింది. అహ్మదాబాద్‌ టెస్టుకు కూడా ఆస్ట్రేలియా రెగ్యూలర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ ‍కమ్మిన్స్‌ దూరం కావడంతో స్మిత్‌నే సారథ్యం వహించనున్నాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు ముందు ఆసీస్‌ జట్టు మెనెజ్‌మెంట్‌తో పాటు స్టీవ్‌ స్మిత్‌ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నాలుగో టెస్టులో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేస్‌ బౌలర్లతో బరిలోకి దిగాలని ఆస్ట్రేలియా జట్టు యోచిస్తన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌ను ఆఖరి టెస్టుకు పక్కనపెట్టనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరంగా గ్రీన్‌ మూడో టెస్టుకు జట్టులోకి వచ్చాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేశాడు.

అతడు ఇంకా పూర్తిగా కోలుకోపోయినట్లు ఇండోర్‌ టెస్టులో కన్పించాడు. బ్యాటింగ్‌లో కూడా కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడు స్థానంలో యువ పేసర్‌ లాన్స్‌ మోరిస్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని స్మిత్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 24 ఏళ్ల లాన్స్‌ మోరిస్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 18 మ్యాచ్‌లు ఆడిన అతడు 59 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌ను టీమిండియా కనీసం డ్రాగా ముగించినా చాలు.. ప్రపంచటెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా):  ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్‌, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), పీటర్ హ్యాండ్స్‌కాంబ్, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్, లాన్స్‌ మోరిస్‌
చదవండి: BGT 2023: ‘ప్యాట్‌ కమిన్స్‌ను తప్పించి.. అతడిని కెప్టెన్‌ చేయండి.. బౌలర్ల కంటే బ్యాటర్లే బెటర్‌’

Advertisement
Advertisement