Australia v West Indies: విండీస్‌ సంచలనం | Australia Vs West Indies 2nd Test: Shamar Joseph Bowls West Indies To Historic Win Over Australia, See Details - Sakshi
Sakshi News home page

AUS Vs WI 2nd Test: విండీస్‌ సంచలనం

Published Mon, Jan 29 2024 5:31 AM

Australia v West Indies: Shamar Joseph bowls West Indies to historic win over Australia - Sakshi

బ్రిస్బేన్‌: వెస్టిండీస్‌ యువ పేసర్‌ షామర్‌ జోసెఫ్‌ (7/68) నిప్పులు చెరిగే బంతులతో ఆ్రస్టేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 1997 తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై వెస్టిండీస్‌కు తొలిసారి టెస్టులో విజయం అందించాడు. ఇప్పటి వరకు ఆడిన 11 డే/నైట్‌ టెస్టుల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా జట్టు షామర్‌ దెబ్బకు 12వ డే/నైట్‌ టెస్టులో తొలిసారి పరాజయం రుచి చూసింది. డే/నైట్‌గా జరిగిన రెండో టెస్టులో ఆట నాలుగో రోజు 216 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ్రస్టేలియా ఓవర్‌నైట్‌ స్కోరు 60/2తో బరిలోకి దిగింది.

ఒకదశలో ఆసీస్‌ 113/2తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కామెరాన్‌ గ్రీన్‌ (42; 4 ఫోర్లు)ను, ట్రావిస్‌ హెడ్‌ (0)ను షామర్‌ జోసెఫ్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేశాడు. ఒకవైపు ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌ (91 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇతర ఆసీస్‌ బ్యాటర్లను షామర్‌ పెవిలియన్‌కు పంపించాడు. చివరకు ఆ్రస్టేలియా 50.5 ఓవర్లలో 206 పరుగులవద్ద ఆలౌట్‌ కావడంతో వెస్టిండీస్‌ 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. షామర్‌ జోసెఫ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తోపాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. షామర్‌ ఈ సిరీస్‌లో 13 వికెట్లు తీయడంతోపాటు 57 పరుగులు చేశాడు.

సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 311; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: 289/9 డిక్లేర్డ్‌; వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 193; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్‌: 206 ఆలౌట్‌ (50.5 ఓవర్లలో) (స్టీవ్‌ స్మిత్‌ 91 నాటౌట్, గ్రీన్‌ 42, స్టార్క్‌ 21, షామర్‌ జోసెఫ్‌ 7/68).

Advertisement

తప్పక చదవండి

Advertisement