ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

Published Sun, Aug 2 2020 8:42 PM

BCCI Gets Government Green Signal To Host IPL 2020 - Sakshi

న్యూఢిల్లీ: అంతా ఊహించినట్లే జరిగింది. యూఏఈ వేదికగా ఐపీఎల్‌-13వ సీజన్‌ జరుపుతామని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) చేసిన విజ్ఞప్తికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దాంతో ఐపీఎల్‌కు మార్గం సుగుమం అయ్యింది. సెప్టెంబర్‌ 19 వద తేదీ నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకూ ఐపీఎల్‌ నిర్వహణకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో బీసీసీఐ ఊపిరిపీల్చుకుంది. ఇప్పటికే ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు అనుమతి తీసుకున్న బీసీసీఐ.. కేంద్రాన్ని ఒప్పించడానికి ముమ్మర కసరత్తు చేసింది. ఇది ఫలించడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కీలక పాత్ర వహించాడు. (వద్దు సార్‌.. జట్టును నాశనం చేస్తాడు!)

ఐపీఎల్‌ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు (2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యూఏఈలో) ఐపీఎల్‌ మ్యాచ్‌లు దేశం బయట జరిగాయి. అలాగని ఇది కూడా అంత సులభమే అనుకుంటే పొరపాటు. ఆ టోర్నీలకు ఇప్పటి టోర్నీకి చాలా తేడా. ఆటగాళ్లు, సిబ్బంది రక్షణే కత్తిమీద సాములా తయారైంది. అయితే ఇంగ్లండ్‌లో సాఫీగా జరిగిన విండీస్‌ పర్యటనతో ఎనిమిది ఫ్రాంచైజీలు ఆడే ఐపీఎల్‌ను పోల్చలేం. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌ (ఎస్‌ఓపీ)లోని నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.వచ్చే వారం ఐపీఎల్‌ మ్యాచ్‌ల తేదీలను ఖరారు చేయనున్నారు. మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య ఎంత గ్యాప్‌ ఉండాలనేది నిర్ణయించడంతో పాటు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లకు అధిక ప్రాధానత్య ఇవ్వనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
 

Advertisement
Advertisement