Ben Stokes 15 Sixes-Batters With Most Sixes In-Ashes Series History - Sakshi
Sakshi News home page

Ben Stokes: యాషెస్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు; రోహిత్‌ను దాటలేకపోయాడు

Published Sat, Jul 29 2023 9:22 PM

Ben Stokes 15 Sixes-Batters With Most Sixes In-Ashes Series History - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ పట్టు బిగిస్తోంది. మూడోరోజు ఆటలో మూడో సెషన్‌లో బ్యాటింగ్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. జో రూట్‌ 71, జానీ బెయిర్‌ స్టో 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో నాలుగో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది. ఆసీస్‌ ముంగిట ఇంగ్లండ్‌ కనీసం 400 పరుగుల టార్గెట్‌ను పెట్టాలని భావిస్తోంది.

ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు వచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్‌ 67 బంతుల్లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. ఈ క్రమంలో స్టోక్స్‌ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో స్టోక్స్‌ చోటు సంపాదించాడు.

ఆసీస్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ 2023లో స్టోక్స్‌ ఇప్పటివరకు 15 సిక్సర్లు బాదాడు. 2018-19లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ ఆటగాడు హెట్‌మైర్‌ కూడా 15 సిక్సర్లు బాదాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ 2019-20లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో 19 సిక్సర్లు బాది తొలి స్థానంలో ఉన్నాడు.

ఇక యాషెస్‌ చరిత్రలో  ఇప్పటివరకు జరిగిన టెస్టు సిరీస్‌లు కలిపి ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా స్టోక్స్‌ రికార్డులకెక్కాడు. స్టోక్స్‌ తర్వాతి స్థానంలో కెవిన్‌ పీటర్సన్‌(2005 యాషెస్‌లో) 14 సిక్సర్లు బాదగా, 2019 యాషెస్‌లో మళ్లీ బెన్‌ స్టోక్స్‌ 13 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా.. 2005 యాషెస్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ 11 సిక్సర్లు బాది నాలుగో స్థానంలో ఉన్నాడు.

చదవండి: Cristiano Ronaldo: 'అవతలికి పో'.. కెమెరామన్‌పై రొనాల్డో అసహనం

వాళ్లు లేరు.. వీళ్లకు ఛాన్స్‌.. బెడిసికొట్టిన ప్రయోగం! 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి..

Advertisement

తప్పక చదవండి

Advertisement