IND vs SA: 'అతడొక యంగ్‌ కెప్టెన్‌.. రానున్న మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణిస్తాడు'

12 Jun, 2022 10:07 IST|Sakshi

ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగిన తొలి టీ20లో భారత్‌ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. 212 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్‌ చేయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. ఇక ఈ సిరీస్‌లో భారత జట్టుకు రిషబ్‌ పంత్‌ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే భారత్‌ ఓటమి పాలవ్వడంతో అతడిపై కొంతమంది విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పంత్‌కు భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మద్దతుగా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనప్పటికీ.. రెండో టీ20లో తమ బౌలర్లు బలంగా తిరిగి వస్తారని భువనేశ్వర్‌ తెలిపాడు.

"అతడు యంగ్‌ కెప్టెన్‌, అదే విధంగా కెప్టెన్‌గా అతడికి ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. సిరీస్‌లో రానున్న మ్యాచ్‌ల్లో అతడు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తాడు. కెప్టెన్‌ ఒక్కడే సరిగ్గా ఉంటే కాదు.. జట్టు మొత్తం రాణిస్తేనే విజయం సాధిస్తాము. తొలి మ్యాచ్‌లో మా బౌలింగ్‌ విభాగం తీవ్రంగా నిరాశపరిచింది. మేము బాగా బౌలింగ్‌ చేసి జట్టును గెలిపించి ఉంటే.. అందరూ పంత్‌ నిర్ణయాత్మక నైపుణ్యాలను ప్రశంసించేవారు. కాగా మా తదుపరి మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతం‍గా రాణిస్తారని ఆశిస్తున్నాను" అని భువనేశ్వర్‌ కుమార్‌ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 కటక్‌ వేదికగా ఆదివారం జరగనుంది.
చదవండి: ZIM vs AFG: నజీబుల్లా మెరుపు ఇన్నింగ్స్‌.. జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపు

మరిన్ని వార్తలు