Sakshi News home page

IPL 2024: రోహిత్‌ శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!?

Published Sat, Feb 10 2024 10:47 AM

Can Rohit Sharma leave Mumbai Indians before IPL 2024? - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ మాజీ సారథి రోహిత్ శర్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీతో రోహిత్‌ తెగదింపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా రెండు నెలల క్రితం తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను ముంబై ఇండియన్స్ తొలిగించిన సంగతి తెలిసిందే.

రోహిత్‌ స్ధానంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకుని మరి జట్టు పగ్గాలను ముంబై అప్పగించింది. ఈ నిర్ణయం రోహిత్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌ పట్ల ముంబై వ్యవహరించిన తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.

తాజాగా ఇదే విషయంపై ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌ మార్క్‌ బౌచర్‌ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయం. రోహిత్‌ శర్మపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. రోహిత్‌పై వర్క్‌ లోడ్‌ తగ్గిస్తే.. అతడు స్వేచ్చగా బ్యాటింగ్‌ చేయగలడని మేము భావిస్తున్నాముని చెప్పుకొచ్చాడు.

అయితే బౌచర్‌ వ్యాఖ్యలపై రోహిత్‌ శర్మ భార్య రితికా సజ్దే స్పందించింది. ఇందులో చాలా వరకు తప్పులే మాట్లాడారంటూ ఆమె కామెంట్‌ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్‌ క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే రితికాతో పాటు హిట్‌మ్యాన్‌ కూడా ముంబై ఫ్రాంచైజీ పట్ల ఆసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఫ్రాంచైజీ మారాలని రోహిత్‌ భావిస్తున్నట్లు వినికిడి. ఐపీఎల్‌-2024 మినీ వేలం తర్వాత తిరిగి ట్రేడింగ్‌ విండో ఓపెన్‌ అయింది. ఈ ఏడాది సీజన్‌ ఆరంభానికి ఒక నెల ముందు వరకు ట్రేడిండ్‌ విండో అందుబాటులో ఉంటుంది.  ఈ నేపథ్యంలో ఇతర ప్రాంఛైజీలు హిట్‌మ్యాన్‌తో సంప్రదింపులు జరిపే ఛాన్స్‌ ఉంది.

మరోవైపు రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా మధ్య కూడా విభేదాలు తలెత్తినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.  ఒకరినొకరు సోషల్‌ మీడియాలో ప్లాట్‌ ఫామ్స్‌లో ఆన్‌ ఫాలో కూడా చేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
చదవండి: 'ప్లీజ్‌.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు'

Advertisement
Advertisement