Sakshi News home page

ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ చాంపియన్స్‌ అల్‌కరాజ్, స్వియాటెక్‌

Published Tue, Mar 19 2024 12:42 AM

Carlos Alcaraz, Iga Swiatek win singles titles at Indian Wells Open - Sakshi

ప్రతిష్టాత్మక ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) టైటిల్‌ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్‌ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్‌)పై గెలిచింది.

2016లో జొకోవిచ్‌ తర్వాత ఇండియన్‌ వెల్స్‌ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్‌గా అల్‌కరాజ్‌ నిలిచాడు. అల్‌కరాజ్‌ కెరీర్‌లో ఇది ఐదో మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌. విజేతలుగా నిలిచిన అల్‌కరాజ్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు... స్వియాటెక్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

Advertisement

What’s your opinion

Advertisement