రైనా వైపు చూసే ప్రసక్తే లేదు: సీఎస్‌కే | Sakshi
Sakshi News home page

రైనా వైపు చూసే ప్రసక్తే లేదు: సీఎస్‌కే

Published Sat, Sep 26 2020 5:30 PM

CSK Not Thinking About Suresh Raina, CEO Kasi Viswanathan  - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభానికి ముందే పలు వ్యక్తిగత కారణాలతో తిరిగి స్వదేశానికి చేరిన సురేశ్‌ రైనా గురించి తాము ఆలోచించడం లేదని సీఎస్‌కే సృష్టం చేసింది. యూఏఈ నుంచి ఆకస్మికంగా రైనా భారత్‌కు వెళ్లిపోయిన  తర్వాత ఆ విషయం గురించి చర్చించడం లేదని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. అసలు తనకు తానుగానే అందుబాటులో లేని రైనా గురించి ఎటువంటి ఆలోచన చేయడం లేదన్నారు. వరుసగా సీఎస్‌కే రెండు మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత రైనా ప‍్రస్తావన వచ్చింది. ఒకవేళ రైనా ఉంటే పరిస్థితి మరొలా ఉండేదని సీఎస్‌కే అభిమానులు కోరుతున్నారు. (చదవండి:సీఎస్‌కేపై సెహ్వాగ్‌ సెటైర్లు)

దీనిలో భాగంగా సీఎస్‌కే సీఈఓ విశ్వనాథన్‌కు ఏఎన్‌ఐ నుంచి ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ మా ఫ్రాంచైజీ రైనా గురించి ఆలోచించడం లేదు. ఒక సీనియర్‌ సభ్యుడైన రైనా అందుబాటులో లేకుండా అతనే వెళ్లిపోయాడు. అతని నిర్ణయాన్ని గౌరవించాం కాబట్టే వదిలేశాం. మళ్ళీ తిరిగి రైనా వైపు చూసే ప్రసక్తే లేదు. మేము రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినంత మాత్రాన ఎటువంటి బెంగా లేదు. మళ్లీ మేము తిరిగి పుంజుకుంటాం. ఎలా అయితే ఢీలా పడ్డామో అంతే వేగంగా టచ్‌లోకి వస్తాం. మాకు విశేషమైన ఫ్యాన్స్‌ ఆశీర్వాదం ఉంది.ఒక గేమ్‌లో మంచి రోజులు-చెడు రోజులు అనేవి రెండూ ఉంటాయి.మా ముఖాల్లో తిరిగి నవ్వులు చూడటానికి ఎంతో సమయం పట్టదు’ అని తెలిపారు.

ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆరంభానికి ముందే రైనా జట్టుతో కలిసి దుబాయ్‌కు చేరుకున్నాడు. అయితే కొన్ని బలమైన కారణాల వల్ల దాదాపు రూ. 11 కోట్ల డబ్బును కూడా కాదనుకుని భారత్‌కు తిరిగి వచ్చాడు. దీనిపై సీఎస్‌కే యాజమాని ఎన్‌ శ్రీనివాసన్‌.. ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆపై వెంటనే అతను తన కొడుకులాంటి వాడు మరొక స్టేట్‌మెంట్‌ ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే రైనా తిరిగి ఆడతానంటూ ప్రకటించాడు. కానీ రైనాపై సీఎస్‌కే ఎటువంటి ఫోకస్‌ పెట్టకపోవడంతో  తన వ్యక్తిగత పనులతో బిజీబిజీగా గడుపుతున్నాడు.

Advertisement
Advertisement