CWC 2023: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. మరో రికార్డుపై కన్నేసిన కోహ్లి | Sakshi
Sakshi News home page

CWC 2023: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. మరో రికార్డుపై కన్నేసిన కోహ్లి

Published Thu, Oct 19 2023 9:43 AM

CWC 2023 IND VS BAN: If Kohli Scores 77 Runs He Will Become Fastest To Complete 26000 Runs - Sakshi

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి మరో రికార్డుపై కన్నేశాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 19) జరిగే మ్యాచ్‌లో కింగ్‌ మరో 77 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత​ వేగంగా 26000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఇటీవలే అత్యంత వేగంగా 25000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన కోహ్లి.. ఇవాల్టి మ్యాచ్‌లో సచిన్‌ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్దమయ్యాడు. 

ఇదిలా ఉంటే, టీమిండియా ఇవాళ పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించిన భారత్‌.. మరో గెలుపుపై కన్నేసింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లపై ఘన విజయాలు సాధించిన భారత్‌.. అదే జోరును బంగ్లాదేశ్‌పై కూడా కొనసాగించాలని భావిస్తుంది. ప్రస్తుతం భారత్‌ జట్టులోని ప్రతి ఆటగాడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను నిలువరించడం ఎంతటి జట్టుకైనా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌.. భారత్‌ను ఏమేరకు నిలువరిస్తుందో వేచి చూడాలి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement