డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌.. 2 ఓవర్లలో 41 పరుగులు! వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

World Cup 2023: డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌.. 2 ఓవర్లలో 41 పరుగులు! వీడియో వైరల్‌

Published Wed, Oct 4 2023 1:29 PM

David Warner starts surprise World Cup warm up spell  - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌తో జరిగిన వామప్‌ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా జట్టు అన్ని విధాలగా ఉపయోగించుకుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్‌ (71 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్‌ గ్రీన్‌ (40 బంతుల్లో 50 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఇన్‌గ్లిస్‌ (48), వార్నర్‌ (48), లబుషేన్‌ (40), మిచెల్‌ మార్ష్‌ (31) అదరగొట్టారు.

డేవిడ్‌ వార్నర్‌, స్మిత్‌ బౌలింగ్‌
కాగా బౌలింగ్‌లో మాత్రం ఆసీస్‌ కెప్టెన్‌ ఎవరూ ఊహించని ప్రయోగాలు చేశాడు. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్లు డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌తో కమ్మిన్స్‌ బౌలింగ్‌ వేయించాడు. వీరు ముగ్గురు కలిపి 14.4 ఓవర్లు వేసి ఏకంగా 159 పరుగులిచ్చారు. వార్నర్‌ అయితే కేవలం 2 ఓవర్లలోనే 41 పరుగులిచ్చాడు.

వార్నర్‌ వైడ్‌లైన్‌తో సంబంధం లేకుండా బౌలింగ్‌ చేశాడు. అంతేకాకుండా ఓ బంతి అయితే ఏకంగా వికెట్‌ కీపర్‌ క్యారీ పైకే వార్నర్‌ విసిరాడు. వార్నర్‌ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా టీమిండియాతో తలపడనుంది.
చదవండి: ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ ఎవరిదో తెలుసా?

Advertisement
Advertisement