ఇదేమి షాట్‌రా బాబు.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌! వీడియో వైరల్‌ | SA20 2024: Dewald Brevis Hits No-Look Six; Video Viral - Sakshi
Sakshi News home page

SA20 2024: ఇదేమి షాట్‌రా బాబు.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌! వీడియో వైరల్‌

Published Fri, Feb 2 2024 1:02 PM

Dewald Brevis slams unbelievable no-look six to bring up his fifty in SA20 - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో ఏంఐ కేప్‌ టౌన్‌ ఆటగాడు, ప్రోటీస్‌ యువ సంచలనం డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఎట్టకేలకు బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ లీగ్‌లో భాగంగా సెంచూరియన్‌ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా బ్రెవిస్‌ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

అయితే ఈ మ్యాచ్‌లో బ్రెవిస్‌ ఓ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు. కేప్‌ టౌన్‌ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన డుపావిలోన్ బౌలింగ్‌లో తొలి బంతిని చూడకుండానే బ్రెవిస్‌ అద్బుతమైన సిక్సర్‌గా మలిచాడు. జూనియర్‌ ఏబీడీ కొట్టిన ఆ షాట్‌ మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రిటోరియాపై 34 పరుగుల తేడాతో ఏంఐ కేప్‌ టౌన్‌ విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్‌ ఆశలను కేప్‌టౌన్‌ సజీవంగా ఉంచుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement