IPL 2023, RCB Vs GT: Dinesh Karthik Breaks Rohit Sharma's IPL Record For The Most Ducks In The IPL - Sakshi
Sakshi News home page

#DineshKarthik: గతేడాది ఫినిషర్‌గా రికార్డు.. ఈ సీజన్‌లో డకౌట్ల రికార్డు

Published Sun, May 21 2023 11:40 PM

Dinesh Karthik-17 Ducks-Worst Records Most Duck-outs IPL History - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బాధ్యతగా ఆడాల్సింది పోయి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో యష్‌ దయాల్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యి చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు.

గతేడాది ఫినిషర్‌గా దినేశ్‌ కార్తిక్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు. లాస్ట్‌ సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన కార్తిక్‌ 330 పరుగులు చేశాడు. ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ ఉన్నప్పటికి ఫినిషర్‌గా మాత్రం రికార్డులు సాధించాడు. కానీ ఈ ఏడాది సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. ఫినిషర్‌గా అదరగొట్టిన ఏడాది వ్యవధిలోనే డకౌట్ల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన బ్యాటర్‌గా దినేశ్‌ కార్తిక్‌ తొలి స్థానంలో నిలిచాడు. 17 డకౌట్లతో కార్తిక్‌ మొదటి స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ 16 డకౌట్లతో రెండు, 15 డకౌట్లతో మణిదీప్‌సింగ్‌, సునీల్‌ నరైన్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

ఇక ఐపీఎల్‌ 16వ సీజన్‌లో దినేశ్‌ కార్తిక్‌ డకౌట్‌గా వెనుదిరగడం ఇది నాలుగోసారి. ఒక సీజన్‌లో అత్యధికసార్లు డకౌట్‌ అయిన ఆటగాళ్ల జాబితాలో దినేశ్‌ కార్తిక్‌ చేరిపోయాడు. జాస్‌ బట్లర్‌(2023, ఐదు డకౌట్లు) తొలి స్థానంలో ఉండగా.. గిబ్స్‌(2009), మిథున్‌ మార్ష్‌(పుణే వారియర్స్‌), మనీష్‌ పాండే(2012), శిఖర్‌ ధావన్‌(2020), ఇయాన్‌ మోర్గాన్‌(2021), నికోలస్‌ పూరన్‌(2021), దినేశ్‌ కార్తిక్‌(2023) నాలుగేసిసార్లు ఒకే సీజన్‌లో డకౌట్‌ అయ్యారు. 

చదవండి: కోహ్లికి సాటెవ్వరు.. ఐపీఎల్‌లో అ‍త్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా

Advertisement

తప్పక చదవండి

Advertisement