హెచ్‌సీఏ అక్రమాలపై ఈడీ విచారణ.. మాజీ అధ్యక్షుడు వినోద్‌కు నోటీసులు

30 Dec, 2023 10:51 IST|Sakshi

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్) విచారణ చేపట్టింది. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం నిర్మాణంలో రూ.20 కోట్ల మేర జరిగిన అవకతవకలపై  దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులను ఈడీ విచారించింది.

మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌లను కూడా ఈడీ ప్రశ్నించింది. హెచ్‌సీఎ మాజీ అధ్యక్షుడు, చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో హాజరుకావాలని వినోద్ కు నోటీస్‌లో పేర్కొంది.
చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్‌లకు నో ఛాన్స్‌

>
మరిన్ని వార్తలు