నెదర్లాండ్స్‌ బ్యాటర్ల అద్భుత పోరాటం.. శ్రీలంక టార్గెట్‌ 263 పరుగులు | Netherlands Vs Sri Lanka, World Cup 2023: Engelbrecht, Van Beek Fifties Lift Netherlands To 262 - Sakshi
Sakshi News home page

CWC NED vs SL: నెదర్లాండ్స్‌ బ్యాటర్ల అద్భుత పోరాటం.. శ్రీలంక టార్గెట్‌ 263 పరుగులు

Published Sat, Oct 21 2023 2:58 PM

Engelbrecht, van Beek fifties lift Netherlands to 262 - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకపై నెదర్లాండ్స్‌ బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన డచ్‌ జట్టు 262 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడిన నెదర్లాండ్స్‌ను.. ఎంగెల్‌బ్రెచ్ట్, వాన్ బీక్ అదుకున్నారు.

వీరిద్దరూ ఏడో వికెట్‌కు 135 పరుగుల రికార్డు భాగస్వామ్యం​ నెలకొల్పారు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే 7వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరిద్దరూ నిలిచారు. ఎంగెల్‌బ్రెచ్ట్‌ 82 బంతుల్లో 70 పరుగులు చేయగా.. వాన్‌ బీక్‌ 75 బంతుల్లో 59 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు అకెరమన్‌ 29 పరుగులతో పర్వాలేదనపించాడు. ఇక​ శ్రీలంక బౌలర్లలో పేసర్లు మధుశంక, రజితా తలా నాలుగు వికెట్లు సాధించారు.
చదవండి: ఇలాంటి బ్యాటర్‌ను చూడలేదు.. మొన్నటి దాకా మావాళ్లు తోపులు అన్నారు.. ఇప్పుడు: రమీజ్‌ రాజా
 

Advertisement
Advertisement