RCB Vs MI: ఫాప్ డుప్లెసిస్ 'నో లూక్‌' సిక్స్‌.. వీడియో వైరల్‌ | IPL 2024 RCB Vs MI: Faf du Plessis New Look Six Shot Against Mumbai Indians, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs MI: ఫాప్ డుప్లెసిస్ 'నో లూక్‌' సిక్స్‌.. వీడియో వైరల్‌

Published Thu, Apr 11 2024 8:29 PM

Faf du plessis no look shot against Mumbai indians - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో  రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అద్భుతమైన షాట్‌తో మెరిశాడు. డుప్లెసిస్‌ న్యూ లూక్‌ షాట్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 2వ ఓవర్‌ వేసిన గెరాల్డ్‌ కోయిట్జీ ఆఖరి బంతిని డుప్లెసిస్‌కు 142.3 కి.మీ వేగంతో గుడ్‌ లెంగ్త్‌ డెలివరీ సంధించాడు.

అయితే ముందుగానే పొజిషన్‌లో వచ్చిన డుప్లెసిస్‌.. బంతిని చూడకుండానే ర్యాంప్‌ షాట్‌ ఆడాడు. అయితే డెలివరీగా ఎక్కువగా పేస్‌ ఉండడంతో దెబ్బకు బంతి స్టాండ్స్‌లో పడింది. దీంతో డుప్లెసిస్‌ న్యూ లూక్‌ సిక్స్‌ చూసిన బౌలర్‌ కొయిట్జీ ఒక్కసారిగా తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement