IPL 2023 RCB Vs GT: Faf du Plessis Rues Wet Conditions After GT Eliminate RCB - Sakshi
Sakshi News home page

RCB Vs GT: అతడే మా కొంపముంచాడు.. చాలా బాధగా ఉంది! కోహ్లి మాత్రం అద్బుతం: ఆర్సీబీ కెప్టెన్‌

Published Mon, May 22 2023 9:12 AM

Faf du Plessis Rues Wet Conditions After GT Eliminate RCB - Sakshi

ఐపీఎల్‌-2023 నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇంటిముఖం పట్టింది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. తద్వారా ప్లేఆప్స్‌ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ కేవలం 19.1 ఓవర్లలోనే ఛేదించింది.

గుజరాత్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్‌ 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి(101) కూడా సెంచరీతో మెరిశాడు. ఇక కీలక మ్యాచ్‌లో ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ స్పందించాడు. శుబ్‌మన్‌ గిల్‌ తన అద్భుత సెంచరీతో మ్యాచ్‌ను తమనుంచి దూరం చేశాడు అని డుప్లెసిస్‌ తెలిపాడు.

"ఈ మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడం మమ్నల్ని తీవ్రంగా నిరాశపరిచింది. మేము అత్యుత్తమ జట్టుతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాం. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. బంతి ఈజీగా బ్యాట్‌పైకి వచ్చింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కూడా మంచు ప్రభావం ఉంది కానీ.. సెకెండ్‌ హాఫ్‌లో మాత్రం ఇంకా ఎక్కువగా ఉంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మేము రెండు సార్లు బంతిని మార్చాం. బౌలర్లకు అంత ‍గ్రిప్‌ దొరకలేదు. విరాట్‌ తన అద్భుత ఇన్నింగ్స్‌తో మాకు మంచి స్కోర్‌ను అందించాడు.

కానీ శుబ్‌మాన్‌ మాత్రం తన విరోచిత సెంచరీతో మ్యాచ్‌ను మా నుంచి దూరం చేశాడు. మేము ఈ ఏడాది సీజన్‌ మొత్తం టాపార్డ్‌లో రాణించనప్పటకీ.. మిడిలార్డర్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాం. గతేడాది కార్తీక్‌ ఫినిషర్‌ పాత్ర పోషించాడు. కానీ ఈ సారి మాత్రం భిన్నంగా ఆడాడు. అదే విధంగా పవర్‌ప్లేతో పాటు డెత్‌ ఓవర్లలో కూడా వికెట్లు సాధించలేకపోయాం. కొన్ని విభాగాల్లో మేము కాస్త మెరుగవ్వాలి" అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేంజేటేషన్‌లో డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్‌ చేసిన నవీన్‌! ఛీ అసలు నీవు

Advertisement
Advertisement