మహిళల జట్టులో అన్నీ రాజకీయాలే!

18 May, 2021 06:31 IST|Sakshi

భారత మహిళల క్రికెట్‌ జట్టు అంతర్గత వ్యవహారాలపై మరో మాజీ కోచ్‌ తుషార్‌ అరోథే తీవ్ర విమర్శలు చేశారు. బయటకు కనిపించని రాజకీయాలు చాలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీమ్‌తో సంబంధం లేని మాజీ మహిళా క్రికెటర్లు బయటినుంచి ఎన్నో విషయాలు శాసిస్తుంటారని అన్నారు. తప్పు ఎవరిదైనా కోచ్‌పైనే వేటు పడుతుందన్న తుషార్‌... అగ్రశ్రేణి జట్లతో పోటీ పడే విధంగా మన సన్నాహకాలు బాగుండాలని చెబితే తాము అంత కష్టపడలేం అన్నట్లుగా వారు వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు