టీమిండియా మాజీ కెప్టెన్‌ కన్నుమూత..

13 Feb, 2024 12:40 IST|Sakshi

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ దత్తాజీరావు గైక్వాడ్(95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అతని పూర్తి పేరు దత్తాజీరావు కృష్ణారావు.

ఆయనను అందరూ ముద్దుగా దత్తా గైక్వాడ్ అని పిలుచుకునేవారు. భారత తరపున 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్‌.. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు. 1959 ఇంగ్గండ్‌ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా దత్తాజీ వ్యవహరించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓటమి పాలైంది.

అదేవిధంగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కూడా 1947 నుంచి 1961 కాలంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 47.56 సగటుతో 3139 పరుగులు చేశారు. అందులో 14 సెంచరీలు ఉన్నాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు