Hyderabad E-prix: రేసింగ్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. ‘ఫార్ములా -ఈ’ రద్దు | Sakshi
Sakshi News home page

Hyderabad E-prix: రేసింగ్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. ‘ఫార్ములా -ఈ’ రద్దు

Published Sat, Jan 6 2024 9:59 AM

Formula E announces cancellation of race in Hyderabad - Sakshi

భాగ్యనగరంలో మరోసారి కారు రేసింగ్‌ పోటీలను వీక్షించాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. హైదరాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 10న జరగాల్సిన ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఇ-ప్రిక్స్ ఫార్ములా- ఇ’ రేసింగ్‌ రద్దైంది. ఈ విషయాన్ని 'ఫార్ములా -ఇ' అధికారికంగా దృవీకరించింది. తెలంగాణ లో ఏర్పాడిన కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో  రద్దు చేస్తున్నట్లు ఫార్ములా -ఇ నిర్వహకులు ప్రకటించారు. 

హైదరాబాద్ కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో ఈ రేస్ నిర్వహించనున్నట్లు  ఫార్ములా ఈ  ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా రేస్ నిర్వహణపై గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంగణపై మున్సిపల్ శాఖకు నోటీష్‌లు జారీ చేస్తామని ఫార్ములా ఈ ఆపరేషన్స్ వింగ్‌ పేర్కొం‍ది.

కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఫార్ములా ఈ సంస్థ ఈ ప్రిక్స్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్లతో కలిసి 2023, అక్టోబర్ 30న రేసింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆ ఎగ్రిమెంట్‌ రద్దు అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫార్ములా- ఇ రేసింగ్‌ మెక్సికోకు తరలి వెళ్లి పోయింది. కాగా గతేడాది ఫిబ్రవరిలో  ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ట్యాంక్ బండ్ వద్ద జరిగిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement