IPL 2023 RCB Vs GT: Hardik Pandya Lauds Youngsters Phenomenal Show Against RCB - Sakshi
Sakshi News home page

చాలా సంతోషంగా ఉంది.. అతడొక అద్భుతం! కొత్తగా కనిపించాడు: హార్దిక్‌

Published Mon, May 22 2023 12:10 PM

Hardik Pandya lauds youngsters phenomenal show against RCB - Sakshi

ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌ జైత్ర యాత్ర కొనసాగుతుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం ఇర్ జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ ఘన విజయం సాధించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే గుజారాత్‌ ఛేదించింది. గుజరాత్‌ విజయంలో ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో గిల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కాగా ఇదే మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి(101) కూడా సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ అద్భుత విజయంపై గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. సెంచరీతో చెలరేగిన గిల్‌పై పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు.

"ఈ మ్యాచ్‌ను మా బాయ్స్‌ అద్భుతంగా ఫినిష్‌ చేశారు. మా రిథమ్‌ను కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. ఇక గిల్‌ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన షాట్‌లు అద్భుతమైనమైనవి.

ఈ రోజు సరికొత్త గిల్‌ను చూశాను. అతడు స్టేడియం నలుమూలలా షాట్లు ఆడాడు. బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా హిట్టింగ్‌ చేశాడు. ఒక ఎండ్‌లో గిల్‌ ఇటువంటి ఇన్నింగ్స్‌ ఆడుతుంటే మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌లో చాలా కాన్ఫిడెన్స్‌ వస్తుంది. అయితే మేము బౌలింగ్‌లో విఫలమయ్యాం.  విరాట్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

డెత్‌ ఓవర్లలో విరాట్‌ను కట్టడి చేయలేకపోయాం. మా ప్రణాళికలు విఫలమయ్యాయి. గతేడాది మేము అద్భుతంగా రాణించాం. కానీ ఏడాది సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌ మాకు సవాలుగా మారింది. అయినప్పటికీ మా బాయ్స్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు" అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు
చదవండి: #Shubman Gill: కాస్తైనా సిగ్గుపడండి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారాలా..

Advertisement
Advertisement