Sakshi News home page

Harshada Sharad Garud: చ‌రిత్ర సృష్టించిన భార‌త యువ వెయిట్ లిఫ్ట‌ర్‌

Published Mon, May 2 2022 10:47 PM

Harshada Sharad Garud First Indian To Win Gold At Junior World Weightlifting Championship - Sakshi

Harshada Sharad Garud First Indian To Win Gold At Junior World Weightlifting Championship: న్యూఢిల్లీ: గతంలో ఏ జూనియర్‌ భారతీయ వెయిట్‌లిఫ్టర్‌కు సాధ్యంకాని ఘనతను మహారాష్ట్ర అమ్మాయి హర్షద శరద్‌ గరుడ్‌ సొంతం చేసుకుంది. గ్రీస్‌లో జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల హర్షద మహిళల 45 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో పసిడి పతకం సాధించిన తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా ఈ పుణే అమ్మాయి గుర్తింపు పొందింది.

 

2020 ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో స్వర్ణం, ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన హర్షద ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ మెరి సింది. స్నాచ్‌లో 70 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తిన హర్షద ఓవరాల్‌గా 153 కేజీలతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. కాన్సు బెక్టాస్‌ (టర్కీ–150 కేజీలు) రజతం... హిన్కు లుమినిత (మాల్డోవా–149 కేజీలు) కాంస్యం నెగ్గారు. గతంలో భారత్‌ తరఫున ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి (2013 లో), జిలీ దలబెహెరా  (2018లో) కాంస్యాలు... అచింత (2021లో) రజతం సాధించారు. 


చ‌ద‌వండి: IPL 2022: ధోని ఉన్నాడుగా.. ఇది జరిగి తీరుతుంది: సెహ్వాగ్‌


 

Advertisement
Advertisement