హోరాహోరీగా హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్

27 Jan, 2023 13:19 IST|Sakshi

Hyderabad Premier Golf League: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో సీజన్ పోటాపోటీగా జరుగతోంది. ఈ సీజన్లో రెండో రౌండ్‌కు బౌల్డర్స్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ ఆతిథ్యమిస్తోంది. నాకౌట్‌ మ్యాచ్‌లు పట్టణంలోనే జరుగనుండగా.. ఫైనల్స్‌కు థాయ్‌లాండ్‌ ఆతిథ్యమివ్వనుంది. కాగా ఈసారి లీగ్‌లో మొత్తం 16 జట్లు తలపడుతున్నాయి.

2020లో 12 జట్లతో మొదలైన హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్‌కు దేశవాప్తంగా యువ గోల్ఫర్స్ నుంచి స్పందన కనిపిస్తోందని లీగ్ కమీషనర్ డీఎస్ సుమంత్ హర్షం వ్యక్తం చేశారు. గోల్ఫ్‌ క్రీడకు మరింత ఆదరణ పెంచడంతో పాటు.. యువ గోల్ఫర్స్‌ను ప్రోత్సహించేందుకు లీగ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. రెండో రౌండ్ పోటీల్లో మహిళా గోల్ఫర్ కవిత మంత ప్లేయర్ ఆఫ్ దే డేగా నిలిచింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 37 పాయింట్లు సాధించింది. కాగా ఇప్పటివరకూ గ్రూప్ ఏలో మీనాక్షి మావెరిక్స్ , సామా ఏంజేల్స్ , గ్రూప్ బిలో అగిల్స్ డర్టీ డజెన్, అక్షర యోధాస్ , గ్రూప్ సీలో ఈహెచ్ ఏఏం , టీమ్ ఆల్ఫా , గ్రూప్ డీలో మైసా ,ఆరిజిన్స్ జట్టు ఆధిక్యంలో ఉన్నాయి.

చదవండి: దంచికొట్టిన ఆయుశ్‌.. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్‌.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌ ఓటమి

మరిన్ని వార్తలు