ప్రపంచంలో ఏకైక పురుష క్రికెటర్‌గా రోహిత్‌ ఆల్‌టైమ్‌ రికార్డు | Ind Vs Afg: Rohit Become First Male Cricketer In World To Play 150 T20Is - Sakshi
Sakshi News home page

Rohit Sharma: ప్రపంచంలో ఏకైక పురుష క్రికెటర్‌గా రోహిత్‌ ఆల్‌టైమ్‌ రికార్డు

Published Sun, Jan 14 2024 8:17 PM

Ind Vs Afg Rohit Become first Male Cricketer In World Feature in 150 T20Is - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో  150వ మ్యాచ్‌ పూర్తి చేసుకున్న తొలి పురుష క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 

అఫ్గనిస్తాన్‌తో ఇండోర్‌ వేదికగా రెండో టీ20 సందర్భంగా ఈ ఫీట్‌ నమోదు చేశాడు. మెన్స్‌ క్రికెట్‌లో షార్టెర్ట్‌ ఫార్మాట్లో తొలుత 150 మ్యాచ్‌ల మైలురాయి అందుకుంది రోహిత్‌ శర్మ కాగా... టెస్టుల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ ఈ ఘనత సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో తొలుత 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న క్రికెటర్లు
150 టెస్టులు: అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) (డిసెంబర్ 1993)
150 వన్డేలు: అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) (ఫిబ్రవరి 1987)
150 టీ20లు: రోహిత్ శర్మ(ఇండియా) (జనవరి 2024)*.

ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ ద్వారా రోహిత్‌ శర్మ దాదాపు 14 నెలల తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు. మొహాలీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఆదిలోనే రనౌట్‌ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇక ఇండోర్‌ వేదికగా ఆదివారం(జనవరి 14) నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రోహిత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు.

టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు
161 - హర్మన్‌ప్రీత్‌ కౌర్ (భారత్, 2009-2024)
152 - సుజీ బేట్స్ (న్యూజిలాండ్, 2007-2023)
151 - డానీ వ్యాట్ (ఇంగ్లాండ్, 2010-2023)
150 - అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా, 2010-2024)
150 - రోహిత్ శర్మ (భారత్, 2007-2024)*

Advertisement

తప్పక చదవండి

Advertisement