IND VS AUS 1st ODI: సెంచరీ పూర్తి చేసిన వార్నర్‌ | IND VS AUS 1st ODI: David Warner Completes 100 Sixes In ODI Cricket - Sakshi
Sakshi News home page

IND VS AUS 1st ODI: సెంచరీ పూర్తి చేసిన వార్నర్‌

Published Fri, Sep 22 2023 3:34 PM

IND VS AUS 1st ODI: David Warner Completes 100 sixes In ODI Cricket - Sakshi

ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వన్డే క్రికెట్‌లో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. మొహాలీ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్‌ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన వార్నర్‌.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ ఈ సిక్సర్‌తో పాటు మరో సిక్సర్‌ కూడా బాది తన సిక్సర్‌ల సంఖ్యను 101కి (148 మ్యాచ్‌ల్లో) పెంచుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 53 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు​ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ఆసీస్‌ టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తూ 26 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ (4), స్టీవ్‌ స్మిత్‌ (41) ఔట్‌ కాగా.. మార్నస్‌ లబూషేన్‌ (23), కెమరూన్‌ గ్రీన్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 2, జడేజా ఓ వికెట్‌ పడగొట్టారు.

వన్డేల్లో అ‍త్యధిక సిక్సర్ల రికార్డు  ఎవరి పేరిట ఉందంటే..?
వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ (331), రోహిత్‌ శర్మ (286), సనత్‌ జయసూర్య (270), ఎంఎస్‌ ధోని (229) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. భారత ఆటగాళ్లు సచిన్‌ (195), గంగూలీ (190), యువరాజ్‌ సింగ్‌ (155), విరాట్‌ కోహ్లి (141), సెహ్వాగ్‌ (136), సురేశ్‌ రైనా (120) 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 

Advertisement
Advertisement