Border-Gavaskar Trophy 2023: India Vs Australia, 2nd Test Day 1 Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

Ind Vs Aus 2nd Test Updates: తొలిరోజు ముగిసిన ఆట.. టీమిండియాదే ఆధిపత్యం

Published Fri, Feb 17 2023 9:05 AM

Ind Vs Aus BGT 2023 2nd Test Delhi: Day 1 Highlights And Updates - Sakshi

Ind Vs Aus BGT 2023 2nd Test Day 1 Highlights And Updates: 

తొలిరోజు ముగిసిన ఆట.. టీమిండియాదే ఆధిపత్యం
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మొదలైన రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్‌ 13, కేఎల్‌ రాహుల్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలిరోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చెలాయింది. కేవలం తొలి సెషన్‌లో మాత్రమే ఆసీస్‌ ఆధిక్యం  కనబరిచినప్పటికి.. మిగతా రెండు సెషన్లలో టీమిండియా బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా తొలిరోజునే తమ ఆటను ముగించాల్సి వచ్చింది.

అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నిం‍గ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లతో పాటు షమీ కూడా చెలరేగడంతో ఆసీస్‌ తొలిరోజునే తన ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖవాజా 81 పరుగులు చేయగా.. పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌ 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్‌, జడేజాలు చెరొక మూడు వికెట్లు తీశారు.

3 ఓవర్లలో టీమిండియా 12/0
తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. తొలిరోజు ఆట ముగియడానికి మరో ఆరు ఓవర్లు మిగిలి ఉన్నాయి. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది.

ఆస్ట్రేలియా 263 ఆలౌట్‌
టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నిం‍గ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లతో పాటు షమీ కూడా చెలరేగడంతో ఆసీస్‌ తొలిరోజునే తన ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖవాజా 81 పరుగులు చేయగా.. పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌ 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్‌, జడేజాలు చెరొక మూడు వికెట్లు తీశారు.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో లయోన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్‌ స్కోరు 246/9 గా ఉంది.

తిప్పేసిన జడేజా.. ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
టీమిండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఒకే ఓవర్లు రెండు వికెట్లతో మెరిశాడు. ముందుగా కమిన్స్‌ను ఎల్బీగా వెనక్కిపంపిన జడ్డూ.. ఆ తర్వాత టాడ్‌ మర్ఫీని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్‌ 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. హ్యాండ్స్‌కోబ్‌ 59, నాథన్‌ లియోన్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

హ్యాండ్స్‌కోంబ్‌ అర్ధ శతకం
నిలకడగా ఆడుతున్న హ్యాండ్స్‌కోంబ్‌, ప్యాట్‌ కమిన్స్‌
నిలకడగా ఆడుతున్న హ్యాండ్స్‌కోంబ్‌(49). ఆస్ట్రేలియా స్కోరు: 218/6 (64). హ్యాండ్స్‌కోంబ్‌తో పాటు ప్యాట్‌ కమిన్స్‌(30) క్రీజులో ఉన్నాడు.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ రెండో టెస్టు
టీ బ్రేక్‌ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు: 199/6 (56)

►46.6: ఆరో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
అశ్విన్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీ(0) అవుట్‌. స్కోరు: 168-6(47)

►167 పరుగులు వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ కోల్పోయింది.  81 పరుగులు చేసిన ఖవాజా.. జడేజా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.
31.2: నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
► టీమిండియా పేసర్‌ షమీ బౌలింగ్‌లో ట్రావిస్‌ హెడ్‌(12) రాహుల్‌కి క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఖవాజా, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ క్రీజులో ఉన్నారు. స్కోరు 109-4(32).

►లంచ్‌ విరామానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు ‍కోల్పోయి 94 పరుగులు చేసింది. క్రీజులో ఖవాజా, హెడ్‌ ఉన్నారు.
అశ్విన్‌ మ్యాజిక్‌..
అశ్విన్‌ స్పిన్‌  మాయాజాలానికి ఆసీస్‌ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. వరుసగా లబుషేన్‌(18), స్మిత్‌(0)లను అశ్విన్‌ పెవిలియన్‌ పంపాడు. 24 ఓవర్లకు ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా..
►50 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన డేవిడ్‌ వార్నర్‌.. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో ఉస్మాన్‌ ఖవాజా, లబుషేన్‌ ఉన్నారు.

►టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా.. వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్‌ ఖవాజా(14), డేవిడ్‌ వార్నర్‌(6) పరుగులతో ఉన్నారు.

►5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు:  19-0. ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్‌ వార్నర్‌ క్రీజులో ఉన్నారు.
►0.1: బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించిన షమీ

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒకే మార్పుతో బరిలోకి దిగింది. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన మిడాలర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు.

దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే విధంగా ఆస్ట్రేలియా కూడా తమ జట్టులో రెండు మార్పులు చేసింది. యువ మాథ్యూ కుహ్నెమన్ ఆసీస్‌ తరపున టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. ఇక తొలి టెస్టులో విఫలమైన రెన్‌షా స్థానంలో ట్రెవిస్‌ హెడ్‌ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు: 
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, మాథ్యూ కుహ్నెమన్

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌

Advertisement
Advertisement