Ind Vs SA: టీమిండియా ఆలౌట్‌.. సౌతాఫ్రికా ఘన విజయం | Ind Vs SA 1st Test Day 3 Centurion Match Latest News Live Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

Ind Vs SA 1st Test: టీమిండియా ఆలౌట్‌.. సౌతాఫ్రికా ఘన విజయం

Published Thu, Dec 28 2023 2:24 PM

Ind Vs SA 1st Test Day 3 Centurion: Updates And Highlights - Sakshi

South Africa Vs India 1st Test Day 3 Updates: సౌతాఫ్రికా ఘన విజయం
34.1: మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి(76) రూపంలో టీమిండియా పదో వికెట్‌ కోల్పోయింది. మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 34.1 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 131 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో సౌతాఫ్రికా ఏకంగా ఇన్నింగ్స్‌ మీద 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవాలన్న రోహిత్‌ సేన కల ఇప్పటికి కలగానే మిగిలిపోయింది. ప్రొటిస్‌ పేసర్లలో నండ్రీ బర్గర్‌ నాలుగు వికెట్లతో చెలరేగి టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. రబడ రెండు వికెట్లు, మార్కో జాన్సెన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా రనౌట్‌లో ఎల్గర్‌, రబడ భాగమయ్యారు.

అంతకు ముందు సౌతాఫ్రికా 408 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. డీన్‌ ఎల్గర్‌ సెంచరీ(185)తో రాణించగా.. బెడింగ్‌హామ్‌(56), మార్కో జాన్సెన్‌(84- నాటౌట్‌) అర్ధ శతకాలతో మెరిశారు. 

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
31.5: సిరాజ్‌ రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్‌ కృష్ణ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 121/9 (31.5). కోహ్లి 67 పరుగులతో ఆడుతున్నాడు.
31.3: ఫోర్‌ బాదిన సిరాజ్‌

బుమ్రా రనౌట్‌.. ఎనిమిదో వికెట్‌ డౌన్‌
30.2: రబడ బౌలింగ్‌లో కోహ్లి పరుగుకు యత్నించగా.. సమన్వయ లోపం కారణంగా బుమ్రా రనౌట్‌ అయ్యాడు. దీంతో టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 117/8 (30.5)

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
28.3: రబడ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగిన శార్దూల్‌ ఠాకూర్‌(2). జస్‌ప్రీత్‌ బుమ్రా క్రీజులోకి వచ్చాడు.  భారత్‌ స్కోరు: 105/7 (28.3)

 నెమ్మదిగా ఆరంభించి.. దూకుడు పెంచిన కోహ్లి
కఠినమైన సెంచూరియన్‌ పిచ్‌పై నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన కోహ్లి.. తర్వాత దూకుడు పెంచాడు. వరుసగా వికెట్లు పడుతున్న తరుణంలో ఆచితూచి ఆడిన ఈ రన్‌మెషీన్‌.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ 50 పరుగుల మార్కు అందుకున్నాడు. 61 బంతుల్లో హాఫ్‌ సెంచరీ(53) పూర్తి చేసుకున్నాడు.

వచ్చీ రాగానే అశ్విన్‌ను పెవిలియన్‌కు పంపిన బర్గర్‌
25.6: నండ్రే బర్గర్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత రాహుల్‌ను అవుట్‌ చేసిన ఈ యంగ్‌ పేసర్‌.. అతడి స్థానంలో వచ్చిన అశూను కూడా పెవిలియన్‌కు పంపాడు. బెడింగ్‌హామ్‌కు క్యాచ్‌ ఇచ్చి అశ్విన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 96-6(26). శార్దూల్‌ ఠాకూర్‌ క్రీజులోకి వచ్చాడు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
25.5: కేఎల్‌ రాహుల్‌(4) రూపంలో టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 96/5 (25.5).

అర్ధ శతకానికి చేరువైన కోహ్లి
20.6: కోయెట్జీ బౌలింగ్‌లో ఫోర్‌ బాదిన కోహ్లి. అర్ధ శతకానికి ఆరు పరుగుల దూరంలో ఉన్న రన్‌మెషీన్‌.

19 ఓవర్లలో భారత్‌ స్కోరు: 78-4
కోహ్లి 34, రాహుల్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయి టీమిండియా
17.5: శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. మార్కో జాన్సెన్‌ అద్భుత బంతితో అయ్యర్‌(6)ను బౌల్డ్‌ చేశాడు. గత ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో కేఎల్‌ రాహుల్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 72/4 (17.5).

మూడో సెషన్‌ మొదలు
17 ఓవర్లలో టీమిండియా స్కోరు:  65-3

ఈసారి అయ్యర్‌ క్యాచ్‌ వదిలేశారు
15.5: మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్‌ స్లిప్‌లో బౌలింగ్‌ చేస్తున్న కీగన్‌ పీటర్సన్‌ వదిలేశాడు. టీ బ్రేక్‌ సమయానికి టీమిండియా 16 ఓవర్లలో  మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే 101 పరుగులు వెనుబడి ఉంది. కోహ్లి 18, అయ్యర్‌ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
13.6: మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో గిల్‌(26) బౌల్డ్‌. స్కోరు: 52-3(14). కోహ్లి 14, శ్రేయస్‌ అయ్యర్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 39/2
గిల్‌- కోహ్లి మధ్య 26 పరుగుల భాగస్వామ్యం. కోహ్లి 8, గిల్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
11.5: జాన్సెన్‌ బౌలింగ్‌లో ముల్దర్‌ క్యాచ్‌ డ్రాప్‌ చేయడంతో కోహ్లికి లైఫ్‌ లభించింది.

►11.1: మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది ఖాతా తెరిచిన కోహ్లి

8 ఓవర్లలో టీమిండియా స్కోరు: 19/2
ఇం​కా ఖాతా తెరవని కోహ్లి.. 13 పరుగులతో క్రీజులో ఉన్న గిల్‌

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌
5.3: నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో యశస్వి జైశ్వాల్‌(5) అవుట్‌. టీమిండియా స్కోరు: 13/2 (5.3). విరాట్‌ కోహ్లి క్రీజులోకి వచ్చాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
2.5: రబడ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ అవుట్‌. 8 బంతులు ఎదుర్కొని సున్నా స్కోరుకు పెవిలియన్‌ చేరిన టీమిండియా కెప్టెన్‌. క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్‌బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌.

ఆధిక్యం ఎంతంటే
టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. తద్వారా 163 పరుగుల ఆధిక్యం సాధించింది.

తొమ్మిదో వికెట్‌ డౌన్‌.. బవుమా ఆబ్సెంట్‌ హర్ట్‌
108.4: బుమ్రా బౌలింగ్‌లో నండ్రే బర్గర్‌ బౌల్డ్‌(0). దీంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ఇదిలా ఉంటే.. మొదటి రోజు ఆటలో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో కెప్టెన్‌ తెంబా బవుమా గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో అతడు బ్యాటింగ్‌కు అందుబాటులో లేకపోవడంతో.. 408 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆలౌట్‌ అయినట్లు అంపైర్లు ప్రకటించారు.  

107 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 407/8. 162 పరుగుల ఆధిక్యం

400 వందల పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా
102.5: బుమ్రా బౌలింగ్‌లో మార్కో జాన్సెన్‌ ఫోర్‌ బాదడంతో సౌతాఫ్రికా స్కోరు 400 దాటేసింది. 

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
100.5: లంచ్‌ బ్రేక్‌ తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టిన టీమిండియాకు తొలి ఓవర్లోనే వికెట్‌ లభించింది. బుమ్రా బౌలింగ్‌లో కగిసో రబడ(1) బౌల్డ్‌ అయ్యాడు. అతడి రూపంలో సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. నండ్రీ బర్గర్‌ క్రీజులోకి వచ్చాడు. 101.5 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు 396/8. టీమిండియా కంటే 151 పరుగుల ఆధిక్యంలో ఉంది.

లంచ్‌ బ్రేక్‌
టీమిండియాతో తొలి టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా భోజన విరామ సమయానికి సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. 100 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. భారత్‌ కంటే 147 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఇక గురువారం నాటి ఆటలో లంచ్‌ బ్రేక్‌ వరకు ఎల్గర్‌ రూపంలో శార్దూల్‌ ఠాకూర్‌, గెరాల్డ్‌ కోయెట్జీ రూపంలో అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో తమ తొలి వికెట్‌ తీసుకున్నారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా 
99.1: అశ్విన్‌ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన గెరాల్డ్‌ కోయెట్జీ(19). అతడి రూపంలో సౌతాఫ్రికా ఏడో వికెట్‌ కోల్పోయింది.

ఎట్టకేలకు ఎల్గర్‌ అవుట్‌
94.5: శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగిన సౌతాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌. దీంతో సౌతాఫ్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. అద్భుత సెంచరీతో చెలరేగి సౌతాఫ్రికాను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న ఎల్గర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడటంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది.

కాగా డీన్‌ ఎల్గర్‌ 185 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. గెరాల్డ్‌ కోయెట్జీ క్రీజులోకి వచ్చాడు. మార్కో జాన్సెన్‌ 60 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 96 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 366/6.

94.3: టెస్టుల్లో మార్కో జాన్సెన్‌ అత్యధిక స్కోరు 
100 పరుగులకు పైగా ఆధిక్యంలో సౌతాఫ్రికా
89.5: వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్న ఎల్గర్‌, జాన్సెన్‌. ఓవర్‌ ముగిసేసరికి ఎల్గర్‌ 179, జాన్సెన్‌ 55 పరుగులతో క్రీజులో ఉన్నారు.
89.2: అశ్విన్‌ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్‌ ఫోర్‌ బాదడంతో సౌతాఫ్రికా 103 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది.

జాన్సెన్‌ హాఫ్‌ సెంచరీ
87.6: సిరాజ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న మార్కో జాన్సెన్‌

78 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా
గత పది ఓవర్లలో 45 పరుగులు సాధించింది సౌతాఫ్రికా. ఎల్గర్‌- జాన్సెన్‌ 74 పరుగుల మెరుగైన భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు. 84వ ఓవర్‌ పూర్తయ్యేసరికి ఆతిథ్య జట్టు 78 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇక రెండో రోజు భారత బౌలర్లలో పేసర్లు సిరాజ్‌, బుమ్రాకు రెండు వికెట్లు దక్కగా.. ప్రసిద్‌ కృష్ణ ఒక వికెట్‌ తన  ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. స్కోరు: 323/5 (84)

 300 పరుగుల మార్కును అందుకున్న సౌతాఫ్రికా
79వ ఓవర్‌: తొలి టెస్టులో టీమిండియాపై సౌతాఫ్రికా ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. 256/5 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన ప్రొటిస్‌ జట్టు 79వ ఓవర్‌ ఆఖరి బంతికి మూడు వందల పరుగుల మార్కును అందుకుంది.

సెంచరీ వీరుడు, ఓపెనింగ్‌ బ్యాటర్‌ డీన్‌ ఎల్గర్‌ గురువారం ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. మరో ఎండ్‌లో మార్కో జాన్సెన్‌ కూడా చక్కటి సహకారం అందిస్తూ  26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

రెండో రోజు హైలైట్స్‌:
బాక్సింగ్‌ డే టెస్టులో శతక్కొట్టిన రాహుల్‌.
ఓవర్‌నైట్‌ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా 245 పరుగులకు టీమిండియా ఆలౌట్‌.
సౌతాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ అజేయ సెంచరీ -140 (211 బంతుల్లో).
అరంగేట్ర బ్యాటర్‌ బెడింగ్హాం అర్ధ శతకం.
రెండో రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు:  256-5(66 ఓవర్లలో).
ఎల్గర్‌తో కలిసి 3 పరుగులతో క్రీజులో ఉన్న మార్కో జాన్సెన్‌.
సౌతాఫ్రికాకు 11 పరుగుల స్వల్ప ఆధిక్యం.

బాక్సింగ్‌ డే టెస్టు: సౌతాఫ్రికా వర్సెస్‌ భారత్‌ తుదిజట్లు:
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్‌ కృష్ణ.

సౌతాఫ్రికా
డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, తెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరైన్‌(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నండ్రే బర్గర్.

Advertisement
Advertisement