Ind Vs SA 1st Test: Trolls As Ajinkya Rahane Replaced Ahead Of Vihari And Iyer - Sakshi
Sakshi News home page

Trolls As Ajinkya Rahane In Playing XI: మరీ ఇంత దారుణమా.. పాపం విహారి.. తనకే ఎందుకిలా!

Published Sun, Dec 26 2021 2:33 PM

Ind Vs Sa 1st Test: Trolls As Ajinkya Rahane Placed Ahead Vihari And Iyer - Sakshi

Ind Vs Sa 1st Test: Trolls As Ajinkya Rahane Placed Ahead Vihari And Iyer: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భాగంగా తెలుగు ప్లేయర్‌ హనుమ విహారి, యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఫామ్‌లేకపోయినప్పటికీ మాజీ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానేకే విరాట్‌ కోహ్లి అవకాశం ఇచ్చాడు. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 టెస్టులు ఆడిన రహానే 411 పరుగులు చేశాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమయ్యాడు. 

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో అతడిపై వేటు పడటం ఖాయమని భావించారంతా. కానీ, అనూహ్యంగా సిరీస్‌కు ఎంపికకావడంతో పాటు డిసెంబరు 26న ఆరంభమైన తొలి టెస్టు తుదిజట్టులో రహానే చోటు దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో క్రీడా విశ్లేషకులు, నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అయ్యర్‌ లేడు.. విహారీ లేడు.. ఐదుగురు బ్యాటర్లతో టీమిండియా ఆడుతోంది. నిజంగా సాహసోపేతమైన నిర్ణయం’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు.

ఇక.. ‘‘పాపం విహారి. మరీ ఇంతదారుణమా. ఎన్నిసార్లు నిరూపించుకున్నా అవకాశం రావట్లేదు. పాపం తనకే ఎందుకిలా?. అయ్యర్‌ను కూడా పక్కనపెట్టేశారు. అజింక్య రహానేకు మాత్రం ఛాన్స్‌ ఇచ్చారు. బహుశా ఇదే అతడికి ఇదే చివరి అవకాశం కావొచ్చు’’అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంతవరకు సఫారీ గడ్డపై టీమిండియా ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఆ లోటు తీర్చుకుని సత్తా చాటాలని కోహ్లి సేన భావిస్తోంది.

చదవండి: Vijay Hazare Trophy Final HP Vs TN: వారెవ్వా.. డీకే సెంచరీ... షారుక్‌ 21 బంతుల్లో 42! హిమాచల్‌కు గట్టి సవాల్‌

Advertisement
Advertisement