Ind Vs WI 2023, 1st Test: West Indies Win the Toss and Choose to Bat First - Sakshi
Sakshi News home page

Ind Vs WI: చెలరేగిన అశ్విన్‌.. తొలిరోజు టీమిండియాదే

Published Wed, Jul 12 2023 7:03 PM

Ind Vs WI 2023 1st Test Day 1: Toss Playing XI Check Highlights - Sakshi

India tour of West Indies, 2023- West Indies vs India, 1st Test:
వెస్టిండీస్‌తో మొదలైన తొలి టెస్టులో తొలిరోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట తొలిరోజు విండీస్‌ను ఆలౌట్‌ చేసిన టీమిండియా అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 40, రోహిత్‌ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు టీమిండియా స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాల ధాటికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ బ్యాటర్లలో అలిక్‌ అతానజే 47 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్‌ ఐదు వికెట్లు పడగొట్టగా.. జడేజా మూడు వికెట్లు, సిరాజ్‌, శార్దూల్‌లు చెరొక వికెట్‌ తీశారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌
27.6:జడేజా బౌలింగ్‌లో బ్లాక్‌వుడ్‌(14) సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో వెస్టిండీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 28 ఓవర్లలో స్కోరు:  68-4.

25 ఓవర్లలో వెస్టిండీస్‌ స్కోరు 59-3
అథనాజ్‌ (11), బ్లాక్‌వుడ్‌ (11) క్రీజులో ఉన్నారు.

20 ఓవర్లలో వెస్టిండీస్‌ స్కోరు:  49-3.
టీమిండియా బౌలర్లలో అశ్విన్‌కు రెండు, శార్దూల్‌ ఠాకూర్‌కు ఒక వికెట్‌ దక్కాయి. అశూ.. విండీస్‌ ఓపెనర్లు చందర్‌పాల్‌, బ్రాత్‌వైట్‌ వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. శార్దూల్‌.. రేమన్ రీఫర్ వికెట్‌ పడగొట్టాడు.

వాళ్ల అరంగేట్రం
వెస్టిండీస్‌- టీమిండియా మధ్య తొలి టెస్టు బుధవారం ఆరంభమైంది. డొమినికాలోని రోసోలో గల విండ్సర్‌ పార్కు ఇందుకు వేదికైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య విండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక టీమిండియా తరఫున ఇషాన్‌ కిషన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో అతడు వికెట్‌ కీపర్‌గా వ్యవహరించనుండగా.. తెలుగు క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌కు మొండిచేయి ఎదురైంది. ఇక ఇషాన్‌తో పాటు యశస్వి జైశ్వాల్‌ కూడా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

కాగా టీమిండియాపై విండీస్‌ గెలిచి ఇప్పటికే రెండు దశాబ్దాలు దాటిపోయింది. సొంతగడ్డపై 2002లో చివరిగా భారత జట్టుపై విజయం సాధించి టెస్టు సిరీస్‌ కైవసం చేసుకంది కరేబియన్‌ జట్టు. ఆ తర్వాత నుంచి వెస్టిండీస్‌పై  పైచేయి సాధించి జైత్రయాత్ర కొనసాగిస్తోంది భారత్‌. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో విండీస్‌ ఈ అపవాదును చెరిపివేసుకుంటుందా లేదంటే టీమిండియా చేతిలో మరోసారి చిత్తవుతుందా వేచి చూడాలి!!

తుది జట్లు ఇవే
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కట్‌, మహ్మద్ సిరాజ్.

వెస్టిండీస్‌:
క్రెగ్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్), తగెనరైన్ చంద్రపాల్, రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్‌, అలీక్ అథనేజ్, జాషువా డా సిల్వా(వికెట్ కీపర్), జేసన్ హోల్డర్, రకీమ్ కార్న్‌వాల్‌, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.

చదవండి: మార్కు చూపించిన తిలక్‌ వర్మ.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో విహారి! ఫైనల్లో జట్టును..
Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్‌ చేసి.. దిగ్గజ బ్యాటర్‌ వికెట్‌ తీసి!

Advertisement
Advertisement