Team India Is Scheduled To Play 88 Matches At Home In Upcoming Broadcast Cycle 2023-28 - Sakshi
Sakshi News home page

Team India Home Games 2023-28: స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు ఇవే.. ఇంగ్లండ్‌, ఆసీస్‌లతోనే అధికం

Published Sat, Aug 5 2023 6:44 PM

India Are Scheduled To Play 88 Matches At Home In Upcoming Broadcast Cycle - Sakshi

రానున్న బ్రాడ్‌కాస్ట్‌ సైకిల్‌లో (సెప్టెంబర్‌ 2023-మార్చి 2028, ఐదేళ్లు) టీమిండియా స్వదేశంలో 88 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తుంది. ఇందులో దాదాపు సగం మ్యాచ్‌లు (39) ఇంగ్లండ్‌, ఆసీస్‌లతోనే జరుగుతాయని ప్రముఖ  క్రికెట్‌ వెబ్‌సైట్‌ క్రిక్‌బజ్‌ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో మొదలయ్యే ఈ సైకిల్‌ 2028 మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌తో ముగుస్తుంది.

కాగా, రానున్న బ్రాడ్‌కాస్ట్‌ సైకిల్‌లో మీడియా హక్కుల కోసం బీసీసీఐ ఇటీవలే టెండర్లకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆగస్ట్‌ 25 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి పేర్కొంది.​ ఆసక్తిగల మీడియా సంస్థలు 15 లక్షల నాన్‌ రీఫండబుల్‌ ఫీజ్‌ చెల్లించాలని తెలిపింది.

సెప్టెంబర్‌ 2023-మార్చి 2028 మధ్యలో స్వదేశంలో టీమిండియా ఆడబోయే సిరీస్‌ల వివరాలు..

  • 2023 సెప్టెంబర్‌: ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌
  • 2023 నవంబర్‌: ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
  • 2024 జనవరి: ఆఫ్ఘనిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
  • 2024 జనవరి-మార్చి: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌
  • 2024 సెప్టెంబర్‌-అక్టోబర్‌: బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
  • 2024 అక్టోబర్‌-నవంబర్‌: న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌
  • 2025 జనవరి-ఫిబ్రవరి: ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
  • 2025 అక్టోబర్‌: విండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌
  • 2025 నవంబర్‌-డిసెంబర్‌: సౌతాఫ్రికాతో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
  • 2026 జనవరి: న్యూజిలాండ్‌తో 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
  • 2026 జూన్‌: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్‌, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌
  • 2026 సెప్టెంబర్‌-అక్టోబర్‌: విండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20లు
  • 2026 డిసెంబర్‌: శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు
  • 2027 జనవరి-మార్చి: ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌లు
  • 2027 నవంబర్‌-డిసెంబర్‌: ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20లు
  • 2028 జనవరి-మార్చి: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ 

Advertisement
Advertisement