చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే! | Sakshi
Sakshi News home page

IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే!

Published Sun, Feb 18 2024 7:02 PM

India record biggest Test win by runs - Sakshi

స్వదేశంలో ఇంగ్లండ్‌ జట్టను మరోసారి భారత్‌ మట్టికరిపించింది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడు టెస్టులో 434 పరుగుల తేడాతో ఘన విజయాన్ని టీమిండియా అందుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఛేదనలో 122 పరుగులకే కుప్పకూలింది. 

ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత విజయంలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ కీలక పాత్ర పోషించారు. జైశ్వాల్‌ డబుల్‌ సెంచరీతో అదరగొట్టగా.. జడ్డూ ఐదు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కూడా జడేజా మెరిశాడు.

చరిత్ర సృష్టించిన భారత్‌..
ఇక ఇక అద్బుతమైన విజయం సాధించిన భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ విజయం. అంతకుముందు 2021లో న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును భారత్‌ బ్రేక్‌ చేసింది.
చదవండి: అతడొక సంచలనం.. ఎంత చెప్పుకున్నా తక్కువే: రోహిత్‌ శర్మ

Advertisement
Advertisement