India Judo Team Withdraws From Olympic Qualifiers After Two Players Test COVID-19 Postive - Sakshi
Sakshi News home page

ఇద్దరికి వైరస్‌... జట్టు మొత్తం వైదొలిగింది

Published Thu, Apr 8 2021 6:06 AM

Indian Judo Team Withdraws From Olympic Qualifiers - Sakshi

న్యూఢిల్లీ: అయ్యో వైరస్‌... ఆడనీయవు, అర్హత కానీయవు. టోక్యో ఒలింపిక్స్‌ వేటలో పడేందుకు క్వాలిఫయింగ్‌ టోర్నీలో తలపడాల్సిన భారత జూడో జట్టు చివరి నిమిషంలో వైదొలిగింది. కిర్గిజిస్తాన్‌ దాకా వెళ్లిన 15 మంది సభ్యులు గల భారత జట్టు పోటీలకు దూరమైంది. ఈ బృందంలోని ఇద్దరు ప్లేయర్లు అజయ్, రీతూలకు కరోనా సోకింది. ఈ నెల 4న భారత జట్టు ఆసియా ఓసియానియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు బిష్కెక్‌ (కిర్గిజిస్తాన్‌)కు  వెళ్లింది. అయితే మొదట 15 మంది జూడోకాలకు, నలుగురు కోచ్‌లకు నిర్వహించిన తొలి పరీక్షల్లో అంతా నెగెటివ్‌గానే బయటపడ్డారు. కానీ టోర్నీకి కాస్త ముందుగా 5న నిర్వహించిన పరీక్షల్లో అజయ్, రీతూ పాజిటివ్‌ అని తేలింది. కరోనా నేపథ్యంలోని టోర్నీ నిబంధనల ప్రకారం జట్టులో ఏ ఒక్కరికి కోవిడ్‌ సోకినా... మొత్తం జట్టంతా పోటీల నుంచి తప్పుకోవాలి.

Advertisement
Advertisement