KL Rahul: 22 పరుగుల దూరం.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బ్యాట్స్‌మన్‌గా | Sakshi
Sakshi News home page

KL Rahul: 22 పరుగుల దూరం.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బ్యాట్స్‌మన్‌గా

Published Tue, Sep 21 2021 5:33 PM

IPL 2021: 3 Milestones Waiting For KL Rahul Vs Rajastan Royals Match - Sakshi

3Milestones For KL Rahul Single Match.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా నేడు కింగ్స్‌ పంజాబ్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటనేవి ఒకసారి పరిశీలిద్దాం. ఇక రికార్డుల విషయానికి వస్తే.. ఐపీఎల్‌లో రాహుల్‌ మూడు వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి కేవలం 22 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇప్పటివరకు 88 మ్యాచ్‌లాడిన కేఎల్‌ రాహుల్‌ 46.53 సగటుతో 2978 పరుగులు చేశాడు. ఒకవేళ రాబోయే మ్యాచ్‌ల్లో గనుక రాహుల్‌ మూడువేల మార్క్‌ను అందుకుంటే ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. 2018 నుంచి పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేఎల్‌ రాహుల్‌ వ్యక్తిగతంగా ప్రతీ సీజన్‌లోనూ అదరగొడుతూనే వస్తున్నాడు. ఒక్క పంజాబ్‌ జట్టు తరపునే రాహుల్‌ 2253 పరుగులు సాధించడం విశేషం.

చదవండి: IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే

4 సిక్సర్లు కొడితే.. పంజాబ్‌ తరపున 100 సిక్సర్లు
కేఎల్‌ రాహుల్‌ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 88 మ్యాచ్‌ల్లో 120 సిక్స్‌లు, 261 ఫోర్లు బాదాడు. కాగా ఇందులో 96 సిక్సర్లు పంజాబ్‌ కింగ్స్‌ తరపునే బాదడం విశేషం. మరో నాలుగు సిక్సర్లు కొడితే.. పంజాబ్‌ కింగ్స్‌ తరపున 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలవనున్నాడు. 


courtesy: IPL.com

6 క్యాచ్‌లు పడితే.. కీపర్‌గా మరో రికార్డు
వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ను మరో రికార్డు ఊరిస్తుంది. రాహుల్‌కు ఐపీఎల్‌లో ఎక్కువగా కీపింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఇప్పటివరకు కీపర్‌గా టి20ల్లో 44 క్యాచ్‌లు అందుకున్నాడు. మరో ఆరు క్యాచ్‌లు అందుకుంటే 50 క్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఇది సాధ్యపడకపోవచ్చు.. కానీ టి20 అంటేనే క్షణాల్లో మారిపోయే ఆట. మరి రాహుల్‌ ఆ రికార్డులను అందుకుంటాడా లేదా చూడాలి.


courtesy: IPL.com

చదవండి: CSK Vs MI: పొలార్డ్‌ చేసిన తప్పు ఇదే.. లేదంటే చెన్నై 80 పరుగులకే ఆలౌట్‌ అయ్యేది!

Advertisement
Advertisement