రనౌట్‌ అయితే అయ్యావు.. కానీ మనసులు గెలుచుకున్నావ్‌

10 Apr, 2021 17:12 IST|Sakshi
కర్టసీ: రోహిత్‌ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెపాక్‌ వేదికగా ఆర్‌సీబీతో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌తో జరిగిన మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్‌ ఒక విషయంలో మాత్రం అభిమానులు, నెటిజనల​ మనసులు గెలుచుకున్నాడు. విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఆడేందుకు మైదానంలోకి వస్తున్న సమయంలో గ్రౌండ్‌లోని కొన్ని కెమెరా యాంగిల్స్‌ రోహిత్‌ శర్మ షూపై పడ్డాయి. రోహిత్‌ వేసుకున్న షూపై ''సేవ్‌ ది రైనోస్‌'' అని రాసి ఉంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ తన ట్విటర్‌లో దీనిపై స్పందించాడు.

''నేను నిన్న మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆట కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. క్రికెట్‌ ఆడడం అనేది నాకు డ్రీమ్‌.. దానిని నెరవేర్చుకున్నా.. కానీ ప్రకృతిని కాపాడలనేది మన బాధ్యత.. అందరం కలిసికట్టుగా పోరాడితే కచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. విషయం ఏంటంటే.. మన దేశంలో ఇండియన్‌ రైనోలు అంతరించే స్థితికి చేరుకున్నాయి.. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనది.. అందుకే నా షూపై అలా రాసుకున్నా. అంటూ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్‌ ఇచ్చిన అవగాహన నెటిజన్లు మనసు దోచుకుంది. మ్యాచ్‌లో రనౌట్‌ అయితే అయ్యావు.. కానీ మా మనసులు గెలిచావ్‌ రోహిత్''‌ అంటూ కామెంట్లు చేశారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఆఖరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌ 48, మ్యాక్స్‌వెల్‌ 39, కోహ్లి 33 పరుగులతో రాణించారు.
చదవండి: గతేడాది ఒక్క సిక్స్‌ కొట్టలేదు.. ఈసారి రిపీట్‌ అవ్వొద్దనే

ఇదేం కోడ్ నాయనా‌.. ఫ్యాన్స్‌ను కన్‌ఫ్యూజ్‌‌ చేసిన జాఫర్‌‌‌

మరిన్ని వార్తలు