‘ఆ బంతుల్ని హిట్‌ చేయాలంటే అంత లేజీ పనికిరాదు’ | Sakshi
Sakshi News home page

‘ఆ బంతుల్ని హిట్‌ చేయాలంటే అంత లేజీ పనికిరాదు’

Published Sat, May 1 2021 4:23 PM

IPL 2021: Kevin Pietersen On Shubman Gill, He Seems So Lazy - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఘోరంగా విఫలమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. టాలెంట్‌ ఉన్నా పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వకపోవడంలో  తేలిపోతున్న గిల్‌ తన ఆట తీరును మార్చుకోవాలని మాజీలు హితవు పలుకుతున్నారు. కేకేఆర్‌ కోచ్‌గా ఉన్న బ్రెండన్‌ మెకల్లమ్‌  సైతం గిల్‌ను పరోక్షంగా తప్పుబట్టాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడకపోతే, స్థానాన్నే వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇదిలాఉంచితే, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ కూడా గిల్‌ ఆడే విధానాన్ని సుతిమెత్తగా విమర్శించాడు.

ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్స్‌తో పీటర్సన్‌ మాట్లాడుతూ.. గిల్‌ తన సమస్యను అతనే చక్కదిద్దుకోవాలన్నాడు. ‘ మనం గిల్‌ గురించి మాట్లాడదాం. గిల్‌ ఒక మంచి క్రికెటర్‌. ఒక ప్లేయర్‌గా అతను నాకిష్టం. కానీ ఇటీవల కాలంలో గిల్‌ ఎందుకో సరిగా ఆడటం లేదు. లేజీగా కనిపిస్తున్నాడు. అతని పూర్తి స్థాయి ఆటతో సత్తాచాటాలి. ఫీల్డ్‌లో మరింత బిజీ కావాలి. అతను ఔటైన కొన్ని సందర్భాలను తీసుకుంటే మరీ నాసిరకంగా పెవిలియన్‌కు చేరుతున్నాడు.

గిల్‌ను చూస్తుంటే ఫిట్‌గా లేనట్లే కనబడుతున్నాడు. గేమ్‌లో స్పీడ్‌ తగ్గింది. బ్యాట్స్‌మన్‌గా మందకొడిగా ఉంటున్నాడు. ఇక నుంచైనా మరింత ఆకర్షణీయమైన క్రికెట్‌ ఆడతాడని ఆశిస్తున్నా. గేమ్‌పై తిరిగి పట్టు సాధిస్తే లెగ్‌పై వచ్చే బంతుల్ని మిస్‌ చేయకుండా హిట్‌ చేయడానికి యత్నిస్తావ్‌. నువ్వు చేయాలనుకున్నది క్లియర్‌గా చేస్తేనే మంచిది. అప్పుడు రిజల్ట్‌ వస్తుంది’ అని తెలిపాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 15, 33,  21, 0, 11,9, 43 పరుగులు మాత్రమే చేశాడు. అతని బ్యాట్‌ నుంచి ఇంకా భారీ స్కోరు రాకపోవడం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. 

ఇక్కడ చదవండి: IPL 2021: షర్ట్‌లు విప్పేసి మరీ హంగామా చేశారు!
'జాగ్రత్త.. సెహ్వాగ్‌కు తెలిసిందో ఇక అంతే' 
అదీ కెప్టెన్‌ అంటే: కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

Advertisement
Advertisement