ఐపీఎల్‌ వాయిదా: ఆనందంలో సంజన గణేషన్‌!

9 May, 2021 12:35 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోన కారణంగా ఐపీఎల్ 2021 అనూహ్యంగా వాయిదా పడడంతో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తన ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా బుమ్రాతో కలిసి ఆనందంగా ఉన్న ఫోటోను సంజన గణేషన్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

కలిసిన ఆనందం కళ్లలో కనిపిస్తోంది
మార్చిలో బుమ్రాకు సంజనకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వివాహం అనంతరం ఐపీఎల్ లీగ్‌ మొదలు కావడంతో ముంబై ఇండియన్స్‌ తరపున  ఆడేందుకు బుమ్రా పయనమయ్యాడు. కరోనా ప్రభావం ఐపీఎల్‌ మీద పడడంతో నిరవధికంగా ఈ సీజన్‌ మధ్యలోనే వాయిదా పడింది. దీంతో ఆటగాళ్లు తిరిగి ఎవరి స్వదేశానికి వాళ్లు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రా కూడా తన ఇంటికి చేరుకున్నాడు. వివాహం అనంతరం మళ్లీ ఇప్పుడు కలిసిన బుమ్రా, సంజనల జంట వాళ్ల ఇంట్లో  సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం బుమ్రాతో కలిసి ఆనందంగా ఉన్న ఫోటోను సంజన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అందులో సంజనను చిరునవ్వుతో చూడవచ్చు. ఇలా తన ఆనందాన్ని ఫోటో రూపంలో షేర్‌ చేసింది. 


ఈ వారం ప్రారంభంలో బుమ్రా సంజనకు పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపారు. ఆ పోస్ట్‌లో అతను తన భాగస్వామిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. అందులో.. ‘రోజూ నా హృదయాన్ని దొంగిలించే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను నిన్ను ప్రేమిస్తునే ఉంటాను’. అని తెలిపాడు. బుమ్రా తన అంతర్జాతీయ అరంగేట్రం 2016 లో చేయగా చాలా తక్కువ సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

( చదవండి: కరోనాపై పోరు: విరుష్క ఫండ్‌ రైజింగ్‌ క్యాంపెయిన్‌ )

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు