షారుఖ్‌కు జలక్‌ ఇచ్చిన రాజస్తాన్‌ ఆటగాళ్లు.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

షారుఖ్‌కు జలక్‌ ఇచ్చిన రాజస్తాన్‌ ఆటగాళ్లు.. వీడియో వైరల్‌

Published Sun, Apr 25 2021 3:46 PM

IPL 2021:Rajasthan Royal Tease KKR After Win Iconic Shah Rukh Khan Pose - Sakshi

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో రాజస్తాన్‌ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరగా.. కేకేఆర్‌ మాత్రం వరుసగా నాలుగు పరాజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ ఆటగాళ్లు కేకేఆర్‌ను టీజ్‌ చేస్తూ షారుఖ్ ఖాన్‌ ఐకానిక్‌ పోస్టర్‌తో చేసిన వీడియో వైరల్‌గా మారింది.

షారుఖ్‌ ఖాన్‌ నటించిన దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాలోని షారుఖ్‌ నిల్చుని రెండు చేతులతో ఫోజిస్తూ నవ్వుతూ ఉండే ఐకాన్‌ ఫోటో అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. అచ్చం అదే మాదిరిగా రాజస్తాన్‌ ఆటగాళ్లు ఫోజు ఇస్తూ నిల్చున్నారు. ఈ వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ​కాగా మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. డెత్‌ ఓవర్లలో మోరిస్‌ విజృంభించడంతో కేకేఆర్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది.కేకేఆర్‌ బ్యాటింగ్‌లో రాహుల్‌ త్రిపాఠి 36 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. దినేశ్‌ కార్తిక్‌ 25 పరుగులు చేశాడు.134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్తాన్‌ బ్యాటింగ్‌లో సామ్సన్‌ 42 పరుగులతో రాణించగా..  మిల్లర్‌ 24 పరుగులు సాధించాడు.

Advertisement
Advertisement