IPL 2022: Rohit Sharma’s Hilarious Happy Holi Funny Video for Fans - Sakshi
Sakshi News home page

Rohit Sharma: రోహిత్‌ హోలీ విషెస్‌.. ఒకవేళ నువ్వు సినిమాలో నటించాల్సి వస్తే! ఇంకేమైనా ఉందా!

Published Fri, Mar 18 2022 5:00 PM

IPL 2022: Rohit Sharma Wishes To Fans on Holi Funny Video Goes Viral - Sakshi

IPL 2022- Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ హాస్య చతురత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. బయట అంత సరదాగా ఉంటాడు. ఇక హోలీ సందర్భంగా మరోసారి తనలోని ఫన్నీ యాంగిల్‌ను బయటపెట్టాడు హిట్‌మ్యాన్‌. ఐపీఎల్‌-2022 ఆరంభం కానున్న నేపథ్యంలో రోహిత్‌ శర్మ తన కుటుంబంతో కలిసి ముంబై జట్టుతో చేరిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో భార్య రితికాతో కలిసి రోహిత్‌ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. విషెస్‌ చెప్పడానికి టేకుల మీద టేకులు తీసుకున్న రోహిత్‌ శర్మ.. ‘‘నాకు నచ్చకుంటే ఎడిట్‌ చేయాలి సరేనా! ఫెస్టివల్‌ ఆఫ్‌ కలర్స్‌ నుంచి స్టార్ట్‌ చేయాలి’’ అంటూ సతీమణిని ఆటపట్టించాడు. మధ్యలో కాస్త చిరాకు పడిన రోహిత్‌.. ఆఖరికి ఎట్టకేలకు హ్యాపీ హోలీ అంటూ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు.

ఇక ఈ వీడియోపై స్పందించిన ముంబై ఇండియన్స్‌.. ‘‘ఈరోజు ఇంటర్‌నెట్‌లో అత్యంత సరదా అయిన వీడియో ఇదే’’ అంటూ కామెంట్‌ చేసింది. ఇక రోహిత్‌ సహచర ఆటగాళ్లు.. సూర్యకుమార్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ , యజువేంద్ర చహల్‌ తదితరులు ఫన్నీ ఎమోజీలతో బదులిచ్చారు. ఇక ఫ్యాన్స్‌ అయితే.. ‘‘భయ్యా.. ఇన్ని టేకులా? ఒకవేళ నువ్వు సినిమాలో నటించాల్సి వస్తే... ఇంకేమైనా ఉందా!’’ అంటూ సరదాగా స్పందిస్తున్నారు. ఇంకెందు ఆలస్యం మీరూ వీడియోపై ఓ లుక్కేయండి! 

చదవండి: IPL 2022 -Lucknow Super Giants : లక్నో సూపర్‌జెయింట్స్‌కు వరుస షాకులు.. మరో ప్లేయర్‌ దూరం!

Advertisement

తప్పక చదవండి

Advertisement