IPL 2023: ఐపీఎల్‌ మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

23 Sep, 2022 16:50 IST|Sakshi

ఐపీఎల్‌-2023 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్హహకాకులు ఆయా ఫ్రాంచైజీలకు సమాచారం కూడా అందించినట్లు తెలస్తోంది. కాగా ఈ మినీ వేలం దాదాపు డిసెంబర్‌ 16న జరిగే అవకాశం ఉంది. అయితే  వేలంకు సంబంధించి వేదిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

కాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌ వచ్చే ఏడాది మార్చి అఖరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  ఈ సారి ఐపీఎల్‌ మ్యాచ్‌లను హోమ్‌, అవే పద్ధతిలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అదే విదంగా  ఈ మినీ వేలంలో ప్రతీ ప్రాంఛైజీ పర్స్ బ్యాలెన్స్‌ను 5 కోట్లు పెంచి 95 కోట్లుగా నిర్ణయించారు.

ఒక వేళ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వదిలివేయడం లేదా ఇతర జట్ల నుంచి తీసుకుంటే పర్స్ బ్యాలెన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు ముందు మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. 

కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ కైవసం చేసుకుంది. అరంగేట్ర సీజన్‌లోనే హార్దిక్‌ పాండ్యా నేతత్వంలోని గుజరాత్‌ అదరగొట్టింది. ఆహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌ను ఓడించి గుజరాత్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
చదవండి: T20 WC 2022: పంత్‌కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే: ఆసీస్‌ దిగ్గజం

మరిన్ని వార్తలు