IPL 2023 KKR Vs GT Match Live Score Updates, Highlights And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

మిల్లర్‌, విజయ్‌ శంకర్‌ విధ్వంసం.. గుజరాత్‌ ఘన విజయం

Published Sat, Apr 29 2023 2:58 PM

IPL 2023: KKR Vs GT Match Live Updates And Highlights - Sakshi

మిల్లర్‌, విజయ్‌ శంకర్‌ విధ్వంసం.. గుజరాత్‌ ఘన విజయం
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. విజయ్‌ శంకర్‌ 24 బంతుల్లో 51 నాటౌట్‌, విజయ్‌ శంకర్‌ 18 బంతుల్లో 32 నాటౌట్‌ విధ్వంసం సృష్టించి గుజరాత్‌ను గెలిపించారు. గిల్‌ 49 పరుగులతో రాణించాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌..
180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ మూడో వికెట​ కోల్పోయింది. 49 పరుగులు చేసిన గిల్‌ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రసెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(26 పరుగులు) రూపంలో రెండో వికెట్‌ కోల్పోయింది. హర్షిత్‌ రానా బౌలింగ్‌లో పాండ్యా ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్‌  మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 
 

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
41 పరుగులు వద్ద గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా రస్సెల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

2 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 13/0
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్‌ గిల్‌ ఉన్నారు.

గుజరాత్‌ టార్గెట్‌ 180 పరుగులు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేకేఆర్‌ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్( 39 బంతుల్లో 81 పరుగులు) రస్సెల్‌ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు.

గుర్బాజ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. గుజరాత్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. లిటిల్‌, నూర్‌ ఆహ్మద్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
 ఆరో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
156 పరుగుల వద్ద కేకేఆర్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన రింకూ సింగ్‌.. నూర్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
135 పరుగుల వద్ద కేకేఆర్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 39 బంతుల్లో 81 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్బాజ్.. నూర్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రస్సెల్‌ వచ్చాడు.

13 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 105/4
13 ఓవర్లు ముగిసే సరికి ​కేకేఆర్‌ 4 వికెట్లు నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో రహ్మానుల్లా గుర్బాజ్(67), రింకూ సింగ్‌(2) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
84 పరుగుల వద్ద కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వెంకటేశ్‌ అయ్యర్‌.. లిటిల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
శార్దూల్ ఠాకూర్ రూపంలో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 6 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 61/2

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 23 పరుగులు వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన జగదీశన్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

గుజరాత్‌ టైటాన్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది.

ఐపీఎల్‌- 2023లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌,  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా..  కేకేఆర్‌ మాత్రం రెండు మార్పులు చేసింది.

గాయం కారణంగా జాసన్‌ రాయ్‌ దూరం కావడంతో అతడి స్థానంలో రహ్మానుల్లా గుర్బాజ్ తుది జట్టులోకి వచ్చాడు. అదే విధంగా ఉమేష్‌ యాదవ్‌ స్థానంలో పేసర్‌ హర్షిత్‌ రాణాకు అవకాశం​ దక్కింది.

తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్‌), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్

కోల్‌కతా నైట్ రైడర్స్: నారాయణ్ జగదీశన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

Advertisement

తప్పక చదవండి

Advertisement