IPL 2023, PBKS Vs DC Highlights: Delhi Capitals Beat Punjab Kings By 15 Runs In Dharamshala - Sakshi
Sakshi News home page

IPL 2023 PBKS Vs DC : లివింగ్‌స్టోన్‌ మెరుపులు వృథా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

Published Wed, May 17 2023 7:08 PM

IPL 2023: PBKS Vs Delhi Capitals Match Live Updates-Highlights - Sakshi

లివింగ్‌స్టోన్‌ మెరుపులు వృథా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం
పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌(48 బంతుల్లో 94, 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడగా.. అథర్వ టైడే 55, ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 22 పరుగులు చేశారు. ఆఖర్లో లివింగ్‌స్టోన్‌ చెలరేగి ఆడి పంజాబ్‌ శిబిరంలో ఆశలు రేపినప్పటికి చేయాల్సిన స్కోరు ఎక్కువగ ఉండడంతో ఏం చేయలేకపోయాడు. ఈ ఓటమితో పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్‌ రేసు నుంచి తప్పుకున్నట్లయింది. 

టార్గెట్‌ 214.. పంజాబ్‌ కింగ్స్‌ 12 ఓవర్లలో 100/2
12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అథర్వ టైడే 48, లివింగ్‌స్టోన్‌ 27 పరుగులతో ఆడుతున్నారు.

ధావన్‌ గోల్డెన్‌ డక్‌.. 6 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 47/1
పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది. అథర్వ టైడే 23, ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 21 పరుగులతో ఆడుతున్నారు.

రొసౌ విధ్వంసం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోరు, పంజాబ్‌ టార్గెట్‌ 214
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలిసారి తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. రిలీ రొసౌ 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 82 నాటౌట్‌ విధ్వంసం సృష్టించగా.. పృథ్వీ షా 38 బంతుల్లో 54 పరుగులు, డేవిడ్‌ వార్నర్‌ 31 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. 

రిలీ రొసౌ హాఫ్‌ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 162/2
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు రిలీ రొసౌ ఐపీఎల్‌లో తొలి అర్థశతకం సాధించాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆరంభం నుంచి దాటిగా ఆడిన రొసౌ 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

దంచుతున్న పృథ్వీ షా, రొసౌ.. 14 ఓవర్లలో ఢిల్లీ 138/1
పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ దూకుడుగా ఆడుతుంది. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 138 పరుగులు చేసింది. పృథ్వీ షా 54, రిలీ రొసౌ 36 పరుగులతో దాటిగా ఆడుతున్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌
46 పరుగులు చేసిన డేవిడ్‌ వార్నర్‌ సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో శిఖర్‌ ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 103 పరుగులు చేసింది. పృథ్వీ షా 46, రొసౌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

10 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 93/0
10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ 46, పృథ్వీ షా 45 పరుగులతో దాటిగా ఆడుతున్నారు.

6 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 61/0
ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. పృథ్వీ షా 35, డేవిడ్‌ వార్నర్‌ 34 పరుగులతో ఆడుతున్నారు.

4 ఓవరల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 35/0
4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ 25, పృథ్వీ షా 10 పరుగులతో ఆడుతున్నారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ కింగ్స్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం ధర్మశాల వేదికగా 64వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్‌), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), సామ్ కుర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదలగ్గా.. పంజాబ్‌ కింగ్స్‌కు ఈ మ్యాచ్‌ కీలకం. అయితే మ్యాచ్‌లో గెలిచినప్పటికి ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 

Advertisement
Advertisement