IPL 2023, RCB Vs LSG Updates & Highlights: Lucknow Beat Bangalore By 1 Wicket - Sakshi
Sakshi News home page

IPL 2023 RCB Vs LSG: పూరన్‌ ఊచకోత.. ఆఖర్లో హైడ్రామా.. చివరి బంతికి లక్నో థ్రిల్లింగ్‌ విక్టరీ

Published Mon, Apr 10 2023 7:15 PM

IPL 2023 RCB Vs LSG Bengaluru: Playing XI Highlights And Updates - Sakshi

పూరన్‌ ఊచకోత.. ఆఖర్లో హైడ్రామా.. చివరి బంతికి లక్నో థ్రిల్లింగ్‌ విక్టరీ
గుజరాత్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆటగాడు రింకూ సింగ్‌ సృష్టించిన విధ్వంసాన్ని మరువకముందే మరో రెండు బ్లాస్టింగ్‌ ఇన్నింగ్స్‌లు నమోదయ్యాయి. ఆర్సీబీతో మ్యాచ్‌లో 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నోను తొలుత స్టోయినిస్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత  పూరన్‌ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్‌లు ఆ జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు.

వీరిద్దరి సిక్సర్ల సునామీ ధాటికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్ద అయ్యింది. ఆఖర్లో పూరన్‌ ఔటయ్యాక లక్నో శిబిరంలో కాస్త అలజడి మొదలైనప్పటికీ బదోని (30) అద్భుతమైన షాట్లు ఆడి తన జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే ఇక్కడే హైడ్రామా చోటు చేసుకుంది. 19వ ఓవర్‌ నాలుగో బంతికి పార్నెల్‌ బౌలింగ్‌లో బదోని సిక్సర్‌ బాది, హిట్‌ వికెట్‌గా ఔటయ్యాడు.

దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లక్నో గెలుస్తుందా లేదా అన్న సందేహం మొదలైంది. అయితే చివరి బంతికి బై రావడంతో లక్నో గెలిచింది. ఫలితంగా ఆ జట్టు వికెట్‌ తేడాతో విజయం సాధించింది.  

దడ పుట్టిస్తున్న పూరన్‌.. 15 బంతుల్లోనే ఫిఫ్టి
213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకున్న లక్నోకు పూరన్‌ జీవం పోస్తున్నాడు. ఈ విండీస్‌ బ్యాటర్‌ కేవలం 15 బంతుల్లోనే 51 పరుగులు చేసి విధ్వంసం కొనసాగిస్తున్నాడు. 

105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన లక్నో
భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో 105 పరుగులకే సగం వికెట్లు (11.1 ఓవర్లలో) కోల్పోయింది. నాలుగు బంతుల వ్యవధిలో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో స్టోయినిస్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత సిరాజ్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ (18) ఔటయ్యారు. 

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన లక్నో.. దీపక్‌ హుడా, పాండ్యా ఔట్‌
వేన్‌ పార్నెల్‌ వేసిన 4వ ఓవర్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ రెండు వికెట్లు కోల్పోయింది. దీపక్‌ హుడా (9), కృనాల్‌ పాండ్యా (0) ఔటయ్యారు. 4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 23/3. కేఎల్‌ రాహుల్‌ (8), స్టోయినిస్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

మూడో బంతికే వికెట్‌ తీసిన సిరాజ్‌
213 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో మూడో బంతికే వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో కైల్‌ మేయర్స్‌ (0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. తొలి ఓవర్‌ తర్వాత లక్నో స్కోర్‌ 5/1గా ఉంది. కేఎల్‌ రాహుల్‌ (0), దీపక్‌ హుడా (0) క్రీజ్‌లో ఉన్నారు.  

కోహ్లి, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోర్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్‌ (46 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో వికెట్‌ నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అమిత్‌ మిశ్రా, మార్క్‌ వుడ్‌కు తలో వికెట్‌ దక్కింది.

19 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌  203/1
డుప్లెసిస్‌ (45 బంతుల్లో 78 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (25 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు)

డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం.. భారీ స్కోర్‌ దిశగా ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి ఔటయ్యాక కూడా ఆర్సీబీ ఏమాత్రం తగ్గట్లేదు. డుప్లెసిస్‌ (34 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు ), మ్యాక్స్‌వెల్‌ (12 బంతుల్లో 21; ఫోర్‌, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టిస్తున్నారు. బిష్ణోయ్‌ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఇద్దరు 3 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్‌ 15 ఓవర్ల తర్వాత 137/1గా ఉంది.  

విరాట్‌ కోహ్లి (61) ఔట్‌
96 పరుగుల స్కోర్‌ వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద విరాట్‌ కోహ్లి అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. డుప్లెసిస్‌ (31), మ్యాక్స్‌వెల్‌ క్రీజ్‌లో ఉన్నారు. ​ 

హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్‌ కోహ్లి
ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విరాట్‌ కోహ్లి 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఆచితూచి ఆడుతున్న డుప్లెసిస్‌ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 8.4 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 71/0.

వీర బాదుడు బాదుతున్న విరాట్‌ కోహ్లి
ఆర్సీబీ ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. కింగ్‌ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 56/0. కోహ్లికి జతగా డుప్లెసిస్‌ (12) క్రీజ్‌లో ఉన్నాడు. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న లక్నో
ఐపీఎల్‌ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్‌ 10) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు పలు మార్పులు చేశాయి. 

ఎల్‌ఎస్‌జీ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలువగా.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ పరాజయంతో ఏడో ప్లేస్‌లో ఉంది. 

తుది జట్లు..
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌కీపర్‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మహిపాల్‌ లోమ్రార్‌, షాబాజ్‌ అహ్మద్‌, డేవిడ్‌ విల్లే, అనూజ్‌ రావత్‌, హర్షల్‌ పటేల్‌, వేన్‌ పార్నెల్‌, మహ్మద్‌ సిరాజ్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), కైల్‌ మేయర్స్‌, దీపక్‌ హుడా, మార్కస్‌ స్టోయినిస్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌కీపర్‌), కృనాల్‌ పాండ్యా, అమిత్‌ మిశ్రా, జయదేవ్‌ ఉనద్కత్‌, రవి బిష్ణోయ్‌, మార్క్‌ వుడ్‌, ఆవేశ్‌ ఖాన్‌

Advertisement
Advertisement