IPL 2023 CSK vs RR: Shivam Dube departs cheaply after not reviewing faulty decision - Sakshi
Sakshi News home page

Shivam Dube: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా..

Published Thu, Apr 13 2023 11:12 AM

IPL 2023: Shivam Dube Departs Cheaply Not Reviewing Faulty Decision Fans Roast Him - Sakshi

IPL 2023 CSK Vs RR: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు శివం దూబేపై అభిమానులు మండిపడుతున్నారు. మైదానంలో ఉన్నపుడు దృష్టి ఆట మీదే ఉండాలని.. నీ తప్పిదం వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం అంపైర్‌ తప్పుడు నిర్ణయం వల్లే కనీసం ఆఖరి దాకా మ్యాచ్‌ సాగిందని.. ఒకవేళ ఈ మహానుభావుడు క్రీజులో ఉండి ఉంటే ఎప్పుడో ఓటమి ఖరారయ్యేందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఐపీఎల్‌-2023లో భాగంగా సీఎస్‌కే- రాజస్తాన్‌ రాయల్స్‌ బుధవారం చెపాక్‌ స్టేడియం వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ క్రమంలో టార్గెట్‌ చేధించేందుకు బరిలోకి దిగిన చెన్నై ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఎల్బీడబ్ల్యూగా
ఫలితంగా చెపాక్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ తొలిసారి గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఇక ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్‌ శివం దూబే 9 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌ సాయంతో 8 పరుగులు చేయగలిగాడు. రాజస్తాన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ‘ఎల్బీడబ్ల్యూ’గా వెనుదిరిగాడు.


PC: Twitter/IPL

నిజానికి సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌ నాలుగో బంతిని అశ్విన్‌ తనశైలిక కాస్త భిన్నంగా డెలివరీ చేశాడు. షాట్‌కు యత్నించిన దూబే బంతిని మిస్‌ చేయడంతో అతడి ఫ్రంట్‌ ప్యాడ్‌కి తగిలింది. దీంతో.. రాజస్తాన్‌ అప్పీల్‌ చేయగా అంపైర్‌ అవుటిచ్చాడు.

నువ్వైనా చెప్పొచ్చు కదా!
అయితే, ఈ రీప్లేలో బాల్‌ ట్రాకింగ్‌లో భాగంగా బంతి వికెట్లను మిస్‌ అయినట్లు తేలింది. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. దీంతో చెన్నై వికెట్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో.. రివ్యూకి వెళ్లి ఉంటే.. దూబే నాటౌట్‌ అన్న విషయం తేలేదని.. కానీ దూబే కనీస ప్రయత్నం చేయకుండా క్రీజును వీడటం సరికాదని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరేమో ఈ తప్పిదంలో దూబేతో పాటు మైదానంలో ఉన్న డెవాన్‌ కాన్వేకు కూడా భాగం ఉందని అతడిని విమర్శిస్తున్నారు. అయితే, అప్పటికే బాల్స్‌ వృథా చేసిన దూబే కనీసం ఇలానైనా పెవిలియన్‌ చేరాడని మరికొందరు ట్రోల్‌ చేస్తున్నారు.  అయితే దూబే ఫ్యాన్స్‌ మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నపుడు ఆ స్థానంలో ఎవరు ఉన్నా ఇలాగే ఆడతారంటూ మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఇలా శివం దూబే పేరు నెట్టింట వైరల్‌గా మారింది.  

చదవండి: అదే మా ఓటమిని శాసించింది.. ఆ విషయం నాకు నిజంగా తెలియదు: ధోని  
చెపాక్‌లో తొలిసారి ఇలా.. అలాంటి పప్పులేమీ ఉడకవు.. అయితే: సంజూ శాంసన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement