IPL 2024 PBKS vs MI: ఉత్కంఠపోరులో పంజాబ్‌ ఓటమి.. | Sakshi
Sakshi News home page

IPL 2024 PBKS vs MI Live Updates: ఉత్కంఠపోరులో పంజాబ్‌ ఓటమి..

Published Thu, Apr 18 2024 6:52 PM

IPL 2024: Punjab Kings vs Mumbai Indians Live Score, Updates And Highlights - Sakshi

IPL 2024 PBKS vs MI Live Updates:

ఉత్కంఠపోరులో పంజాబ్‌ ఓటమి..

ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 9 పరుగులతో ఓటమి పాలైంది. 192 పరుగుల భారీలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 183 పరుగులకే ఆలౌలైంది. పంజాబ్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో హర్‌ప్రీత్‌ బ్రార్‌, రబాడ ఉన్నారు. అటు ముంబై విజయానికి కేవలం ఒక్క వికెట్‌ దూరంలో నిలిచింది.

ఈ క్రమంలో ఆఖరి ఓవర్‌ వేసే బాధ్యతను కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఆకాశ్‌ మధ్వాల్‌కు అప్పగించాడు. తొలి బంతిని మధ్వాల్‌ వైడ్‌గా సంధించాడు. ఈ క్రమంలో పంజాబ్‌ విజయసమీకరణం ఆరు బంతుల్లో 11 పరుగులుగా మారింది. తొలి బంతిని రబాడ ఆఫ్‌ సైడ్‌ డీప్‌ పాయింట్‌ దిశగా ఆడి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు.

అయితే మహ్మద్‌ నబీ వికెట్‌ కీపర్‌వైపు సూపర్‌త్రో వేశాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఇషాన్‌ కిషన్‌ స్టంప్స్‌ను గిరాటేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌లు థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేయగా రీప్లేలో రనౌట్‌గా తేలింది. దీంతో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్‌ ఆఖరి వరకు రావడంలో ఆ జట్టు ఆటగాడు అశుతోష్‌ కీలక పాత్ర పోషించాడు. 28 బంతుల్లో 7 సిక్సర్లు,2 ఫోర్లతో అశుతోష్‌ ఫైటింగ్‌ నాక్‌ ఆడాడు. ఓ దశలో మ్యాచ్‌ను ఈజీగా గెలిపించేలా కన్పించిన అశుతోష్‌.. అనూహ్యంగా ఔటయ్యి తన జట్టును గెలిపించలేకపోయాడు.

పంజాబ్‌ ఎనిమిదో వి​కెట్‌ డౌన్‌.. అశుతోష్‌ ఔట్‌
168 పరుగుల వద్ద పంజాబ్‌ కింగ్స్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 61 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన అశుతోష్‌.. కోయిట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

అశుతోష్‌ సిక్సర్ల వర్షం.. విజయానికి చేరువలో పంజాబ్‌
పంజాబ్‌ బ్యాటర్‌ అశుతోష్‌ శర్మ సంచలన ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. అశుతోష్‌ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 16 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజులో ఆశుతోష్‌ శర్మ(59), హర్‌ప్రీత్‌ బ్రార్‌(10) పరుగులతో అన్నారు. పంజాబ్‌ విజయానికి 24 బంతుల్లో 28 పరుగులు కావాలి.

15 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 141/7

15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. క్రీజులో ఆశుతోష్‌ శర్మ(47), హర్‌ప్రీత్‌ బ్రార్‌(10) పరుగులతో అన్నారు.
పంజాబ్‌ ఏడో వికెట్‌ డౌన్‌.. శశాంక్‌ ఔట్‌
శశాంక్‌ సింగ్‌ రూపంలో పంజాబ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 41 పరుగులు చేసిన శశాంక్‌ సింగ్‌.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 120/7. క్రీజులో అశుతోష్‌ శర్మ(36) పరుగులతో ఉన్నాడు.

పంజాబ్‌ ఆరో వికెట్‌ డౌన్‌.. జితేష్‌ ఔట్‌
77 పరుగుల వద్ద పంజాబ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జితేష్‌ శర్మ.. ఆకాష్‌ మధ్వాల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 87/6. క్రీజులో శశాంక్‌ సింగ్‌(37), అశుతోష్‌ శర్మ(9) పరుగులతో ఉన్నారు.
8 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 60/5
8 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ 5 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. క్రీజులో జితేష్‌ శర్మ(7), శశాంక్‌ సింగ్‌(21) పరుగులతో ఉన్నారు.
14 పరుగులకే 4 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్‌
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బుమ్రా,కోయిట్జీ తలా రెండు వికెట్లు పడగొట్టారు.  పంజాబ్‌ బ్యాటర్లు ప్రబ్‌ సిమ్రాన్‌(0), రోసో(1), సామ్‌ కుర్రాన్‌(6), లివింగ్‌ స్టోన్‌(1) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.

పంజాబ్‌ రెండో వికెట్‌ డౌన్‌..
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రోసో క్లీన్‌ .. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

తొలి వికెట్‌ డౌన్‌..

193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కోయిట్జీ బౌలింగ్‌లో ఫ్రబ్‌ సిమ్రాన్‌ సింగ్‌ పెవిలియన్‌కు చేరాడు. తొలి ఓవర్‌ ముగిసే సరికి పంజాబ్‌ వికెట్‌ నష్టానికి 12 పరుగులు చేసింది.

సూర్యకుమార్‌ విధ్వంసం.. పంజాబ్‌ టార్గెట్‌ 193 పరుగులు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.

53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు రోహిత్‌ శర్మ(36), తిలక్‌ వర్మ(34) పరుగులతో రాణించారు.  పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్‌ కుర్రాన్‌ రెండు, రబాడ ఓ వికెట్‌ సాధించారు.

ముంబై నాలుగో వికెట్‌ డౌన్‌.. హార్దిక్‌ పాం‍డ్యా ఔట్‌
167 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్యా.. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు ముంబై స్కోర్‌: 167/4

ముంబై మూడో వికెట్‌ డౌన్‌.. సూర్యకుమార్‌ ఔట్‌
148 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 78 పరుగులు చేసిన సూర్య.. సామ్‌ కుర్రాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు

15 ఓవర్లకు ముంబై స్కోర్‌: 130/2
15 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌  2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌(67), తిలక్‌ వర్మ(17) పరుగులతో ఉన్నారు.

ముంబై రెండో వికెట్‌ డౌన్‌.. రోహిత్‌ శర్మ ఔట్‌
రోహిత్‌ శర్మ రూపంలో ముంబై రెండో వికెట్‌ కోల్పోయింది. 36 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. సామ్‌ కుర్రాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌(59), తిలక్‌ వర్మ(5) పరుగులతో ఉన్నారు

సూర్యకుమార్‌ యాదవ్‌ ఫిప్టీ..
సూర్యకుమార్‌ యాదవ్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 34 బంతుల్లో సూర్య తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌(51), రోహిత్‌ శర్మ(36) పరుగులతో ఉన్నారు

10 ఓవర్లకు ముంబై స్కోర్‌: 86/1
10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌(49), రోహిత్‌ శర్మ(29) పరుగులతో ఉన్నారు

7 ఓవర్లకు ముంబై స్కోర్‌:58/1
7 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌(24), రోహిత్‌ శర్మ(26) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ముంబై..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన  ఇషాన్ కిష‌న్‌.. రబాడ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి సూర్య కుమార్ యాద‌వ్ వ‌చ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(10), సూర్యకుమార్‌ యాదవ్‌(9) పరుగులతో ఉన్నాడు.

ఐపీఎల్‌-2024లో భాగంగా ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో సామ్ కుర్రాన్ సార‌థ్యం వ‌హిస్తున్నాడు.

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ , జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), రిలీ రుసో, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, అశుతోష్ శర్మ
 

Advertisement

తప్పక చదవండి

Advertisement