Sakshi News home page

IPL 2024 RR VS GT: శివాలెత్తిన సంజూ శాంసన్‌

Published Wed, Apr 10 2024 10:17 PM

IPL 2024 RR VS GT: Sanju Samson Made Third Fifty Of The Season - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 10) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్‌ శివాలెత్తిపోయి మెరుపు హాఫ్‌ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ.. ప్రస్తుత సీజన్‌లో మూడో అర్దశతకాన్ని నమోదు చేశాడు.

తొలుత లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో అజేయమైన 82 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత ఆర్సీబీపై 42 బంతుల్లో 69.. తాజాగా గుజరాత్‌పై 38 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్‌లో భీకరఫామ్‌లో ఉన్న సంజూ.. 5 మ్యాచ్‌ల్లో 157.69 స్టయిక్‌రేట్‌తో 82 సగటున 246 పరుగులు చేసి, విరాట్‌ (316), రియాన్‌ల (261) తర్వాత సీజన్‌ మూడో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. 

గుజరాత్‌తో మ్యాచ్‌లో సంజూతో పాటు రియాన్‌ పరాగ్‌ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్‌ 8, హెట్‌మైర్‌ 13 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

టార్గెట్‌ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్‌
రాజస్థాన్‌ నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 30/0గా ఉంది. సాయి సుదర్శన్‌ (19), శుభ్‌మన్‌ గిల్‌ (11) క్రీజ్లో ఉన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement