IPL 2024: ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా..? | Sakshi
Sakshi News home page

IPL 2024: ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా..?

Published Fri, Apr 26 2024 6:19 PM

Jasprit Bumrah To Open With Rohit Sharma?

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ కాకుండా బ్యాటింగ్‌ తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశమైంది.  

 

నెట్స్‌లో గంటల కొద్దీ బుమ్రా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఫ్రాంఛైజీ ఎక్స్‌లో షేర్ చేసింది. బుమ్రా రివర్స్ స్వీప్‌, పుల్  షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నటు ఈ వీడియోలో కన్పించింది. కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మెనెజ్‌మెంట్ బ్యాటింగ్ ఆర్డర్‌లో బుమ్రాకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ తరహాలో..  బుమ్రాతో ఓపెనింగ్ చేయంచాలని ముంబై మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అదే జరిగితే రోహిత్‌ శర్మతో కలిసి బుమ్రా ముంబై ఇన్నింగ్స్‌ను ఆరంభించే ఛాన్స్‌ ఉంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో బుమ్రా బంతితో అదరగొడుతున్నాడు. 13 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా బుమ్రా కొనసాగుతున్నాడు.


 

Advertisement
Advertisement