క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు ఇండియాలో లేరు.. అందుకే ఇలా: పాక్‌ ప్లేయర్‌ | Sakshi
Sakshi News home page

Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్‌ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు

Published Fri, Jan 27 2023 1:56 PM

Kamran Akmal: Not Winning ICC In Decade Not Make India Bad Team - Sakshi

Team India- BCCI: టీమిండియాపై పాకిస్తాన్‌ వెటరన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ ప్రశంసలు కురిపించాడు. దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవనంత మాత్రాన తక్కువ చేయాల్సిన పనిలేదని.. ఇప్పటికీ భారత్‌ గొప్ప జట్టేనని వ్యాఖ్యానించాడు. దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలే టీమిండియా విజయవంతంగా ముందుకు సాగడానికి ప్రధాన కారణమని కమ్రాన్‌ అక్మల్‌ పేర్కొన్నాడు.

అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్‌ చేయాలి!
మిగతా బోర్డులకు.. బీసీసీఐకి ఉన్న తేడా అదేనంటూ పీసీబీ అధికారుల తీరును ఉద్దేశించి విమర్శలు చేశాడు. పాక్‌టీవీతో మాట్లాడిన కమ్రాన్‌ అక్మల్‌ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదంటూ చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. 

ఒకవేళ ఐసీసీ టైటిల్‌ గెలవడమే ప్రధానం అనుకుంటే.. న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా వంటి జట్లను ఇప్పటికే నిషేధించాల్సింది. ప్రతిసారి మేజర్‌ ఈవెంట్లలో విజేతగా నిలవాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఏదేమైనా ఇండియా ఇప్పటికీ గొప్ప జట్టే. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్లు వివిధ ఫార్మాట్లలో సత్తా చాటుతూనే ఉన్నారు.

భ్రష్టు పట్టించేవాళ్లు లేరు
నిజానికి ఇండియాలో దేశవాళీ క్రికెట్‌ను భ్రష్టు పట్టించే వాళ్లు ఎవరూ లేరు. అయితే, గత 7-8 ఏళ్లుగా పాకిస్తాన్‌లో మాత్రం కొంతమంది పనిగట్టుకుని డొమెస్టిక్‌ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారు’’ అని కమ్రాన్‌ అక్మల్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పనితీరుపై ఘాటు విమర్శలు చేశాడు. కాగా 1983, 2011 వన్డే ప్రపంచకప్‌, 2007 టీ20 ప్రపంచకప్‌, 2002, 2013 చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెలవలేదు.

చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్‌ అంటే అంతే! టాస్‌ గెలిస్తే...
ICC T20 World Cup: ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై

Advertisement
Advertisement